Officer on Duty Sensational : నెట్ ఫ్లిక్స్ లో మాలీవుడ్ మూవీ హ‌వా

ఆఫీస‌ర్ ఆన్ డ్యూటీ నెంబ‌ర్ వ‌న్

Officer on Duty : ఇప్పుడు ఓటీటీలదే రాజ్యం. థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన సినిమాలు కొన్ని ఆడితే మ‌రికొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచాయి. ఇంకొన్ని బొక్క బోర్లా ప‌డ్డాయి. ఆయా మూవీస్ ను ఆద‌రించిన దానిని బ‌ట్టి మార్కెట్ ఉంటుంది. ఇటీవ‌ల విడుద‌లైన రెండు చిత్రాలు చిన్న బ‌డ్జెట్ తో రూపొందాయి. భాష‌ల‌తో సంబంధం లేకుండానే జ‌నం ఆద‌రించారు. వాటిని స‌క్సెస్ చేశారు. దీన్ని బ‌ట్టి చూస్తే కంటెంట్ ఈజ్ కింగ్ అని తేలి పోయింది.

Officer on Duty Movie Sensational on Netflix

ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యాయి త‌మిళం, తెలుగులో డ్రాగ‌న్, మారి ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం ఏకంగా వంద కోట్ల‌ను దాటేసింది. ఇందులో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ , కయాతు లోహ‌ర్ న‌టించింది. ఇదే స‌మ‌యంలో వ‌చ్చిన మ‌రో చిన్న బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన చిత్రం కోర్ట్. ఈ చిత్రం ఇప్ప‌టికే రూ. 50 కోట్లు దాటేసింది. ఇక దీనిని ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ. 8 కోట్ల‌కు ఓటీటీ హ‌క్కులు చేజిక్కించుకుంది. ఇది కూడా రికార్డే . దీనిని న‌టుడు నాని నిర్మించాడు.

తాజాగా ఇదే సేమ్ బ‌డ్జెట్ తో త‌యారైన సినిమా మ‌ల‌యాళంలో వ‌చ్చింది . అదే ఆఫీస‌ర్ ఆన్ డ్యూటీ(Officer on Duty). ఇండ‌స్ట్రీని షేక్ చేసింది. జ‌నం పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని ఆద‌రించారు. ఈ చిత్రాన్ని కూడా భారీ ధ‌ర‌కు చేజిక్కించుకుంది ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. తాజాగా స్ట్రీమింగ్ అయిన మూవీస్ లో ఎక్కువ‌గా స్ట్రీమింగ్ నిమిషాలు న‌మోదు చేసింది మాలీవుడ్ మూవీ. రూ. 15 కోట్లు పెట్టి తీస్తే ఇప్ప‌టికే రూ. 50 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. గ‌త ఫిబ్ర‌వ‌రి 20న విడుద‌ల చేశారు.

ఈ సినిమా ప్ర‌స్తుతం మార్చి 20 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రియ‌మ‌ణి, వైశాఖ్ నాయ‌ర్, కుంచ‌కో బోబ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. జీతూ అష్ర‌ఫ్ తీశాడు. సినిమాను చూసిన వాళ్లంతా మెచ్చుకోకుండా ఉండ‌లేక పోతున్నారు. నీరాజనం ప‌లుకుతున్నారు. స్ట్రీమింగ్ ప‌రంగా చూస్తే టాప్ లో ఆఫీస‌ర్ ఆన్ డ్యూటీ(Officer on Duty) ఉండ‌గా డ్రాగ‌న్, ఎమ‌ర్జెన్సీ, ఆజాద్, తండేల్, ద ఎల‌క్ట్రిక్ స్టేట్, విడాముయార్చి, ధూమ్ ధామ్ నిలిచాయి.

Also Read : Naalo Yedho Song Sensational :క‌ల‌ల‌కు రెక్క‌లు తొడిగిన‌ నీతో చెలిమే రుజువైందనీ

CinemaMollywoodTrendingUpdates
Comments (0)
Add Comment