Operation Sindoor : యావత్ భారతమంతా ఒకే ఒక్క పేరు జపిస్తోంది గత కొన్ని రోజులుగా . ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) ఈ పేరు ఎక్కడ చూసిని వినిపిస్తోంది..కనిపిస్తోంది. సంచలనం రేపింది. దీనిని ప్రధాని మోదీ పెట్టినట్లు జోరుగా ప్రచారం జరిగింది. దీనిని ఎవరూ అభ్యంతరం పెట్టలేదు. ఇది దేశానికి సంబంధించిన అంశం. పూర్తిగా అమానవీయంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అత్యంత దారుణంగా జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో 26 మంది పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. డ్రోన్లతో దెబ్బ కొట్టింది.
Operation Sindoor Movie Sensational Updates
అయినా పాకిస్తాన్ తన తీరు మార్చు కోవడం లేదు. మొదట కాల్పుల విరమణ పాటిస్తామని ప్రకటించింది. అమెరికా చెప్పినందుకు తాము ఇలా చేశామంటూ వెల్లడించింది పాకిస్తాన్. కానీ తాను చెప్పిన మాటను పట్టించు కోలేదు. తిరిగి దాడులకు తెగబడింది. ఈ సమయంలో ఆపరేషన్ సిందూర్ పేరుతో మూవీ తీస్తున్నట్లు ప్రకటించారు దర్శకుడు ఉత్తమ్ నితిన్. దీని పేరుతో ఉన్న టైటిల్ కోసం పెద్ద ఎత్తున నిర్మాతలు పోటీ పడ్డారు. చివరకు నిక్వీ భగ్నానీ ఫిల్మ్స్ కు ఛాన్స్ దక్కింది. ఈ సందర్బంగా వర్చువల్ గా ఆపరేషన్ సిందూర్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
మే 6 ,7 మధ్య రాత్రి భారత సాయుధ దళాలు జరిపిన ఆపరేషన్ సిందూర్ ఆధారంగా దీనిని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు దర్శకుడు . భారత్ మాతా కీ జై అని క్యాప్షన్ రాశారు. ఇందులో తుపాకీ పట్టుకుని నుదుటన సింధూరం పెట్టుకున్న మహిళ ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో ట్యాంకులు, ముళ్ల కంచెలు, ఫైటర్ జెట్స్ , మండుతున్న యుద్ద భూమిని చూపించే ప్రయత్నం చేశారు. పూర్తిగా జాతీయవాదం నేపథ్యంగా సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రకటించాడు దర్శకుడు.
Also Read : Popular Dir Pradeep Ranganathan: డ్రాగన్ ఫేమ్ ప్రదీప్ డ్యూడ్ ఫస్ట్ లుక్ రిలీజ్