Operation Sindoor Sensational :ఆప‌రేష‌న్ సిందూర్ పోస్ట‌ర్ హ‌ల్ చ‌ల్

పాకిస్తాన్ పై దాడికి ప్ర‌ధాని పెట్టిన పేరు

Operation Sindoor : ఇంకా షూటింగ్ మొద‌లు కాకుండానే సెన్సేష‌న్ క్రియేట్ చేసింది ఒకే ఒక్క పేరు. అదే దేశాన్ని ఊపు ఊపేస్తోంది. ప్ర‌పంచాన్ని విస్తు పోయేలా చేసింది. అదేమిటంటే ఆప‌రేష‌న్ సిందూర్. జ‌మ్మూ క‌శ్మీర్ లోని అనంత నాగ్ జిల్లా ప‌హ‌ల్గామ్ లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో 26 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ అమాన‌వీయ చ‌ర్య‌ను యావ‌త్ ప్ర‌పంచం ఖండించింది. భార‌త దేశం పూర్తిగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

Operation Sindoor Sensational

ఇదే స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం దాడుల‌కు శ్రీ‌కారం చుట్టింది. పాకిస్తాన్ స‌పోర్ట్ తో రెచ్చి పోతున్న ఉగ్ర మూక‌ల‌ను తుద‌ముట్టించింది. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. చివ‌ర‌కు అమెరికా జోక్యంతో సద్దు మ‌ణిగింది. అయినా ఆప‌రేష‌న్ సిందూర్(Operation Sindoor) ఆపేది లేదంటూ దేశ ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించారు జాతిని ఉద్దేశించి. ఈ త‌రుణంలో ఆప‌రేష‌న్ సిందూర్ అనే పేరు పెట్టింది ప్ర‌ధాని కావ‌డం విశేషం.

ఈ టైటిల్ ను పొందేందుకు పెద్ద ఎత్తున పోటీ ప‌డ్డారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు. చివ‌ర‌కు బాలీవుడ్ లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ నిక్కీ విక్కీ భ‌గ్నావీ ఫిల్మ్స్ అధికారికంగా చేజిక్కించుకుంది. ఈ మేర‌కు ఆప‌రేష‌న్ సిందూర్ సినిమాను తీస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు పోస్ట‌ర్ ను కూడా రిలీజ్ చేశారు మూవీ మేక‌ర్స్. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌లై సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈ పోస్ట‌ర్ లో సింధూరం ధ‌రించిన మ‌హిళ యూనిఫాం తో ఉండ‌డం మ‌రింత బ‌జ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాకు ఉత్త‌మ్ నితిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు.

Also Read : Tollywood Popular Hero’s : ఒకే వేదిక‌పై సూప‌ర్ స్టార్స్

Operation SindoorPahalgam AttackUpdatesViral
Comments (0)
Add Comment