Tanuj Virvani: పెళ్ళి పీటలెక్కనున్న టాలీవుడ్ బ్యూటీ వారసుడు

పెళ్ళి పీటలెక్కనున్న టాలీవుడ్ బ్యూటీ వారసుడు

పెళ్ళి పీటలెక్కనున్న టాలీవుడ్ బ్యూటీ వారసుడు

Tanuj Virvani: ‘రతి అగ్నిహోత్రి’ 1980 దశకంలో సినిమా ప్రేక్షకులకు బాగా గుర్తున్న టాలీవుడ్ హీరోయిన్. అందాలరాశి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బొంబాయి బ్యూటీ పదికి పైగా సినిమాల్లో నటించి… పున్నమినాగుతో మెగాస్టార్ చిరంజీవి సరసన ప్రేక్షుకులను మెప్పించింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసిన రతి… పెళ్ళి తరువాత ముంబైలో సెటిలయ్యింది. ఇటీవలే నందమూరి బాలకృష్ణ నటించిన డిక్టేటర్ సినిమాతో మరోసారి టాలీవుడ్ లో కనిపించింది. అయితే తల్లి వారసత్వంలో 2013లో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తనూజ్ విర్వాని(Tanuj Virvani)… మూడు సినిమాలు చేసినా గుర్తింపు పొందలేకపోయాడు. దీనితో వెబ్ సిరీస్ లపై దృష్టి సారించి… ప్రస్తుతం ఓటీటీ స్టార్ గా కొనసాగుతున్నారు.

Tanuj Virvani – బాలీవుడ్ లో ఫెయిల్… ఓటీటీలో సక్సెస్…

నటుడు, మోడల్ గా గుర్తింపు పొందిన తనూజ్… బాలీవుడ్ లో ఫెయిల్ కావడంతో వెబ్ సిరీస్ లపై దృష్టి సారించి సక్సెస్ అయ్యాడు. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఇన్ సైడ్ ఎడ్జ్’ సిరీస్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తనూజ్… ఆ తరువాత కోడ్ M, పాయిజన్, మసాబా మసాబా వంటి వెబ్ సిరీసు లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే కెరీర్ కు మంచి బాటలు పడుతున్నాయనే సమయంలో తనూజ్… ఇంట్రెస్టింగ్ న్యూస్ తో బయటకు వచ్చాడు. తన్య జాకబ్ ను త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నట్లు ప్రకటిస్తూనే… తమ ఎంగేజ్ మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అయితే డేటింగ్, లివింగ్ రిలేషన్ షిప్ లతో గతంలో వార్తల్లోకెక్కిన తనూజ్… ఒక్కసారిగా తన ఎంగేజ్ మెంట్ ఫోటోలను షేర్ చేయడంపై అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ బ్యూటీ రతి… వారసుడిగా తనూజ్ కు మరికొంతమంది శుభాకాంక్షలు చెబుతున్నారు.

అక్షరతో డేటింగ్… ఇజ్బెల్లాలో రిలేషన్‌ షిప్… తన్యతో ఎంగేజ్ మెంట్…

ఇక బొంబాయి బ్యూటీ రతి వారసుడు తనూజ్ విర్వాని విషయానికి వస్తే… కమల్ హాసన్ కుమార్తె అక్షర హాసన్ తో సుమారు నాలుగేళ్ళ పాటు డేటింగ్ చేసాడు. ఆ తరువాత ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫేమ్ నటి ఇజ్బెల్లాలో రిలేషన్‌ షిప్ లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు డేటింగ్, రిలేషన్ షిప్ లను ప్రక్కన పెడుతూ ఎంగేజ్ మెంట్ ఫోటోలను బయటపెట్టడం ద్వారా కాబోయే భార్యను అందరికీ పరిచయం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Also Read : Mangalavaaram: ‘మంగళవారం’ కు భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ దెబ్బ

Inside EdgeRati AgnihothriTanuj Virvani
Comments (0)
Add Comment