Pahalgam Attack -Arijit Concert :పహ‌ల్గామ్ ఎఫెక్ట్ అర్జిత్ సింగ్ సంగీత క‌చేరి ర‌ద్దు

త‌న ప్ర‌ద‌ర్శ‌న జ‌ర‌గ‌ద‌ని ప్ర‌క‌టించిన గాయ‌కుడు

Pahalgam Attack : ప్ర‌ముఖ గాయ‌కుడు అర్జిత్ సింగ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. తాను చెన్నై వేదిక‌గా ఆదివారం నిర్వ‌హించే మ్యూజిక్ క‌చేరిని నిర్వ‌హించడం లేదంటూ తెలిపాడు. సామాజిక మాధ్య‌మం ఇన్ స్టా గ్రామ్ వేదిక‌గా వెల్ల‌డించాడు. ఈ అసౌకర్యానికి మ‌న్నించాల‌ని కోరాడు. తాజాగా జ‌మ్మూ కాశ్మీర్ లోని అనంత‌నాగ్ జిల్లా పెహ‌ల్గామ్ లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు విచ‌క్ష‌ణా ర‌హితంగా భార‌తీయ ప‌ర్యాట‌కుల‌పై కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో స్పాట్ లోనే 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇదిలా ఉండ‌గా ఆదివారం ఈ ఈవెంట్ జ‌ర‌గాల్సి ఉంది.

Arjith Singh Cancelled for Pahalgam Attack

నిర్వాహ‌కులు సైతం ఈ విష‌యాన్ని సినీ ,పాట‌ల ప్రేమికుల‌కు తెలియ చేశారు. త్వ‌ర‌లోనే ఎప్పుడు క‌చేరి ఉంటుంద‌నే దానిపై క్లారిటీ ఇస్తామ‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు ఇన్ స్టా వేదిక‌గా టాప్ సింగ‌ర్ అర్జిత్ సింగ్(Arijit Singh). తాను ఓ భార‌తీయుడిగా దారుణ‌మైన ఘ‌ట‌న‌ను పూర్తిగా ఖండిస్తున్నాన‌ని తెలిపాడు. ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌వాద దాడి బాధితుల‌కు సంఘీభావాన్ని ప్ర‌క‌టిస్తున్నాన‌ని తెలిపాడు. వారి కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ చేశాడు.

బాధితుల‌కు బాస‌ట‌గా నిలుస్తున్నాం. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో యావ‌త్ జాతి శోక సంద్రంలో మునిగి పోయింది. ఇప్పుడు మేము సంగీత క‌చేరి నిర్వ‌హించాల‌ని అనుకోవ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశాడు సింగ‌ర్ అర్జిత్ సింగ్. యావ‌త్ భార‌త‌మంతా ఇవాళ బాధితుల కోసం ఆక్రోశిస్తోంద‌న్నాడు. ప్ర‌తి భార‌తీయుడి గుండె మండుతోంద‌ని, తాను కూడా తీవ్ర‌మైన బాధ‌కు లోన‌వుతున్న‌ట్లు వాపోయాడు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూడాల‌ని కోరారు.

Also Read : Hero Balakrishna – Akhanda 2 :బాల‌య్య అఖండ -2 జార్జియాలో షూటింగ్

Arjit SinghPahalgam AttackUpdatesViral
Comments (0)
Add Comment