Pakistan : ఢిల్లీ – దాయాది పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్ పై దాడులకు తెగబడుతోంది. ఓ వైపు కాల్పుల విరమణ పాటిస్తామని ప్రకటించిన పాకిస్తాన్ ఉన్నట్టుండి దొంగ దారిన మళ్లీ దాడులకు పాల్పడింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ముమ్మరం చేసింది అటాక్ ను. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అఖిలపక్షం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కీలక భేటీలో కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుబ్రమణ్యం జైశంకర్ తో పాటు త్రివిధ దళాల అధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు.
Pakistan Attacks India
ఇదిలా ఉండగా ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు స్వయంగా రంగంలోకి దిగారు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయినా పాకిస్తాన్ తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. మరో వైపు భారత్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. పాకిస్తాన్ ను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. అయితే ఎక్కడా సామాన్య పౌరులను, ప్రార్థనా మందిరాలపై అటాక్ చేయలేదు. అయితే పాక్ మాత్రం నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రత్యేకించి భారత్ లోని ప్రార్థనా మందిరాలు, గురుద్వారా, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో దాడులకు తెగ బడింది.
Also Read : PM Modi Important Meeting :పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన