Panch Minar Song Sensational :జాను మేరీ జాను నువ్వే నా పాంచ్ మినార్

రాజ్ త‌రుణ్ మూవీ నుంచి సాంగ్ రిలీజ్

Panch Minar : రామ్ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం పాంచ్ మినార్. ఇందులో కీ రోల్ పోషిస్తున్నాడు యంగ్ హీరో రాజ్ త‌రుణ్. ఇది పూర్తిగా కామెడ్, క్రైమ్ , ఎంట‌ర్ టైన‌ర్ గా తీర్చి దిద్దే ప‌నిలో ప‌డ్డాడు. షూటింగ్ శ‌ర వేగంంగా కొన‌సాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే విడుద‌ల చేసిన తొలి సాంగ్ కు సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా మూవీ మేక‌ర్స్ రెండ‌వ పాట‌ను రిలీజ్ చేశారు. పాట కెవ్వు కేక అనిపించేలా ఉంది. అద్భుతంగా చిత్రీక‌రించారు సాంగ్ ను.

Panch Minar Movie Song Sensational

పాంచ్ మినార్(Panch Minar) చిత్రాన్ని మాధ‌వి, ఎంఎస్ ఎం రెడ్డి నిర్మించారు సంయుక్తంగా. త్వ‌ర‌లోనే చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇక పాట విష‌యానికి వ‌స్తే జాను మేరీ జాను నువ్వే జాను అంటూ ప్రియుడు పాడుకునే పాట‌. శ్రీ‌హ‌ర్ష ఆమ‌ని ఈ సాంగ్ ను రాశాడు. శేఖ‌ర్ చంద్ర స్వ‌ర ప‌రిచారు . యువ గాయ‌కుడు వినాయ‌క్ హృద్యంగా ఆలాపించారు.

పాంచ్ మినార్ చిత్రంలో త‌ళుక్కున మెరిసింది రాశి సింగ్. రాజ్ త‌రుణ్ తో చేసిన కెమిస్ట్రీ సూప‌ర్ గా ఉంది. ప్ర‌త్యేకించి ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ ఏమిటో తెలిసి పోతుంది. ప‌క్కాగా అన్ని వ‌ర్గాల‌ను అల‌రించేలా తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు. రాజ్ , రాశితో పాటు అజ‌య్ ఘోష్, బ్ర‌హ్మాజీ, శ్రీ‌నివాస్ రెడ్డి, నితిన్ ప్ర‌స‌న్న‌, ర‌వివ‌ర్మ కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఆదిత్య జ‌వ్వాది కెమెరా ప‌నిత‌నం సూప‌ర్ గా ఉంది.

Also Read : Hero Pawan-Hari Hara Veera Mallu :షూటింగ్ కంప్లీట్ రిలీజ్ కు రెడీ

CinemaRaj TarunUpdatesViral
Comments (0)
Add Comment