ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం ఏ ముహూర్తంలో ప్రారంభించాడో కానీ తను నిర్మించిన చిత్రం హరి హర వీరమల్లు అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ వచ్చింది. చివరకు తానే ముందుండి జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామంటూ ప్రకటించాడు. ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేయక పోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. విచిత్రం ఏమిటంటే ఇందులో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ నటించారు.
మొదటగా చారిత్రక నేపథ్యంతో కథను రాశాడు ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ సమయంలో సినిమా వస్తుందో రాదో తెలియని సమయంలో రత్నం సోదరుడి కొడుకు జ్యోతికృష్ణ సినిమాను పూర్తి చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఇప్పట్లో మూవీ వచ్చే ఛాన్స్ లేదని తేలి పోయింది. తాజా సమాచారం మేరకు హరి హర వీరమల్లును జూలై 11వ తేదీకి మార్చే యోచనలో ఉన్నట్టు టాలీవుడ్ లో టాక్.
గతంలో 17వ శతాబ్దంలోని మొగల్ సామ్రాజ్య నేపథ్యంలో వీరమల్లు అనే యోధుడి పాత్రను పోషించాడు పవన్ కళ్యాణ్. బాబీ డియోల్ ఔరంగాజేబ్ పాత్రలో విలన్ గా నటించారు. వంగా సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన యానిమల్ మూవీలో కీ రోల్ పోషించాడు. ఆ తర్వాత తనకు వరుసగా ఛాన్స్ లు వస్తున్నాయి. తనకు పునర్ జన్మను ప్రసాదించాడంటూ వంగాను కొనియాడారు. ఇక సినిమా పరంగా ఎందుకు ఆలస్యం అవుతుందనే దానిపై ఇంకా అనుమానాలు నెలకొన్నాయి.