Hero Pawan-Hari Hara Veera Mallu :జూన్ 12న హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు విడుద‌ల‌

మే 30న కాద‌ని ప్ర‌క‌టించిన మూవీ మేక‌ర్స్

Hari Hara Veera Mallu : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ , నిధి అగ‌ర్వాల్ న‌టించిన చిత్రం హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు. దీనిని ప్ర‌ముఖ నిర్మాత ఎంఎం ర‌త్నం నిర్మించాడు. భారీ ఖ‌ర్చు చేశాడు. ఈ చిత్రం విడుద‌ల‌య్యేందుకు కొంత గ్యాప్ ఏర్ప‌డింది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బిజీగా ఉండ‌డ‌మే. త‌ను ఏపీ రాజ‌కీయాల‌లో కీ రోల్ పోషిస్తున్నాడు. డిప్యూటీ సీఎంగా కొలువు తీరాడు. దీంతో ప‌నుల్లో బిజీగా ఉండ‌డంతో చాలా మ‌టుకు స‌మ‌యం ఇవ్వ‌లేక పోయాడు సినిమా కోసం.

Hari Hara Veera Mallu Release Updates

ప్రారంభించిన స‌మ‌యంలో దీనికి జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌ను మొద‌టి భార్య‌కు విడాకులు ఇచ్చాడు. మ‌రో డాక్ట‌ర్ ను పెళ్లి చేసుకున్నాడు. అనూహ్యంగా ఈ సినిమా ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్నాడు. త‌న‌కు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు, నిర్మాత‌కు మ‌ధ్య ఏం జ‌రిగింద‌నేది తెలియ రాలేదు. ఆ త‌ర్వాత దీనిని మ‌రో కొత్త ద‌ర్శ‌కుడు భుజాన మీద వేసుకున్నాడు. ఎలాగోలా హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు(Hari Hara Veera Mallu)ను పూర్తి చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నాడు. ఇప్ప‌టికే పోస్ట‌ర్స్, టీజ‌ర్, సాంగ్స్ కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.

దీనికి సంగీతం అందించాడు ఆస్కార్ అవార్డు గ్ర‌హీత ఎంఎం కీర‌వాణి. ఇందులో ప్ర‌త్యేక‌త ఏమిటంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌యంగా పాట పాడాడు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే ఆరు నూరైనా స‌రే సినిమాను అనుకున్న తేదీకే రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించాడు నిర్మాత ర‌త్నం. కానీ చెప్పిన మాట‌కు క‌ట్టుబ‌డలేక పోయాడు. మే 30న ప్రేక్ష‌కుల ముందుకు హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు వ‌స్తుంద‌న్నాడు. ఇప్పుడు మాట మార్చాడు. జూన్ 12న ప‌క్కాగా రిలీజ్ చేస్తామ‌ని తెలిపాడు. మ‌రి ఆరోజైనా వ‌స్తుందా లేదా అన్న‌ది ఇంకా చెప్ప‌లేం. మొత్తంగా ఫ్యాన్స్ మాత్రం తెగ ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు ప‌వ‌న్ మూవీ కోసం.

Also Read : Hero Nithin-Robinhood :జీ 5లో నితిన్ శ్రీ‌లీల మూవీ స్ట్రీమింగ్

CinemaHari Hara Veera MalluNiddhi Agarwalpawan kalyanTrendingUpdates
Comments (0)
Add Comment