Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిధి అగర్వాల్ కీలక పాత్ర పోషించిన హరి హర వీరమల్లు మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిపై ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మూవీ మేకర్స్ త్వరలోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కొడుకు సింగపూర్ లో అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు అలాంటిది ఏమీ కనిపించడం లేదు. దీంతో హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu) సినిమా అనుకున్న టైంకు వస్తుందా అన్న అనుమానం నెలకొంది మెగా అభిమానుల్లో.
Hari Hara Veera Mallu Release Update
ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ మేనియా, స్టార్ ఇమేజ్ ఈ సినిమాకు అదనపు బలం కానున్నాయని నిర్మాత రత్నం భావిస్తున్నారు. ఆయన భారీ ఖర్చు పెట్టి తీస్తున్నాడు. హరి హర వీరల్లు భారతీయ సినిమాను షేక్ చేయడం ఖాయమని జోష్యం చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ సినిమాకు ఇప్పటికే ఉన్న దర్శకుడిగా పని చేసిన జాగర్లమూడి క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి అర్దాంతరంగా నిష్క్రమించాడు. తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ఇంకో డాక్టర్ తో జతకట్టాడు. ఆయన స్థానంలో కొత్త దర్శకుడు జ్యోతికృష్ణ ఎంట్రీ ఇచ్చాడు.
ఇప్పటికే హరి హర వీరమల్లు మూవీ పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ కల్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టుగా చారిత్రాత్మక నేపథ్యంతో తెరకెక్కుతోంది. ఈ చిత్రం 2020లో ప్రకటించారు. పడుతూ లేస్తూ వచ్చింది. పవన్ రాజకీయాలలో కీలక రోల్ పోషించడం, ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. షూటింగ్ పూర్తి చేసుకుంది. మే 9వ తేదీన హరి హర వీరమల్లును విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాత రత్నం. నెల దగ్గర వస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి క్యాంపెయిన్ లేక పోవడం గమనార్హం.
Also Read : Hero Rajinikanth-Jailer 2: స్పీడ్ పెంచిన తలైవా జైలర్ 2