Hero Pawan Kalyan- HHVM Song :హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు ‘కొల్ల‌గొట్టినాదిరో’ సాంగ్ రిలీజ్

ఆక‌ట్టుకునేలా చిత్రీక‌రించిన మూవీ మేక‌ర్స్

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, నిధి అగ‌ర్వాల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు చిత్రానికి సంబంధించి రెండ‌వ సాంగ్ కొల్ల‌గొట్టినాదిరో విడుద‌ల చేశారు మూవీ మేక‌ర్స్. ఈ సినిమాపై ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌యంగా పాడిన పాట‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.

Pawan Kalyan Hari Hara Veera Mallu Song…

ఎంఎం ర‌త్నం స‌మ‌ర్ప‌ణ‌లో మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై ద‌యాక‌ర్ రావు నిర్మించారు హ‌రి హ‌ర వీర‌మ‌ల్లును. దీనిని దృశ్య కావ్యంగా మలిచే ప‌నిలో ప‌డ్డాడు ద‌ర్శ‌కుడు. ఆస్కార్ అవార్డు గ్ర‌హీత ఎంఎం కీర‌వాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ పాడిన మాట వినాలి పాట దుమ్ము రేపింది. చార్ట్స్ లో టాప్ లో కొన‌సాగింది.

తాజాగా కొల్ల గొట్టి నాదిరో పాట‌కు అదిరి పోయేలా కొరియోగ్ర‌ఫీ అందించారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్, నిధి అగ‌ర్వాల్ న‌టించారు. సూప‌ర్ గా ఉంది. ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ అని చెప్ప‌క త‌ప్ప‌దు. వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ అదిరి పోయింది. ప‌వ‌న్, నిధితో పాటు అన‌సూయ భ‌ర‌ద్వాజ్, పూజిత పొన్నాడ కూడా న‌టించారు హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు(Hari Hara Veera Mallu) చిత్రంలో.

కొల్ల‌గొట్టినాదిరో పాట‌ను మంగ్లీ , రాహుల్ సిప్లిగంజ్ , ర‌మ్య బెహ‌రా, యామిని ఘంట‌సాల‌, మోహ‌న్ భోగ‌రాజు, ఇరా ఉడిపి, వైష్ణ‌వి క‌న్న‌న్ , సుదీప్ కుమార్, అరుణ్ మేరి పాడారు. ఈ పాట‌ను చంద్ర‌బోస్ తెలుగులో రాస్తే, పా విజ‌య్ త‌మిళంలో, మంకొంబు గోపాల్ కృష్ణ‌న్ మ‌ల‌యాళంలో, వ‌ర‌ద రాజ్ క‌న్న‌డ‌లో , అబ్బాస్ టైరే వాలా హిందీలో దీనిని రాశారు.

Also Read : Oorellipota Mama Series Sensational :ఊరెల్లి పోతా మామా అదుర్స్

CinemaHari Hara Veera Mallupawan kalyanSongTrendingUpdates
Comments (0)
Add Comment