నాలో ధైర్యాన్ని ఇచ్చింది మురుగ‌న్

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

తమిళ‌నాడు – నాలో ధైర్యాన్ని ఇచ్చింది మురుగ‌న్ అని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. త‌మిళ‌నాడులోని మధురైలో జ‌రిగిన మురుగ భ‌క్త‌ర్గ‌ల్ మానాడు స‌భ‌లో ప్ర‌సంగించారు. మురుగన్‌ను నమ్మితే ఎదుగుదల సాధ్య‌మ‌వుతుంద‌ని అన్నారు. అంద‌రూ మీనాక్షి అమ్మ వారిని ద‌ర్శించుకుంటార‌ని, కానీ ఒక స‌మ‌యంలో ఆ ఆల‌యం ధ్వంస‌మైంద‌న్న విష‌యం ఎంత మందికి తెలుసు అని ప్ర‌శ్నించారు. 14వ శ‌తాబ్దం ప్రారంభంలో మ‌ధురైని మాలిక్ క‌పూర్ దోచుకున్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్రకాశించాల్సిన ఆలయంలో వెలుతురు లేదు. కుంకుమ ఇవ్వాల్సిన ఆలయంలో ఇచ్చేవారూ లేరు.
పూజలు జరగలేదన్నారు.. ఆ తర్వాత 60 సంవత్సరాల పాటు మీనాక్షి ఆలయం మూసి వేశార‌న్నారు. అలాంటి మధురై చీకటి కాలంలో 14వ శతాబ్దం చివరలో మళ్లీ వెలుతురు పుట్టిందన్నారు. ఆ వెలుతురును వెలిగించిన వాడు విజయనగర యువరాజు కుమార కంబణన్ అన్నారు.

మనం అర్థం చేసుకోవాల్సింది. మన విశ్వాసాన్ని ఎవరూ నిలువరించ లేర‌న్నారు. మన సాంప్రదాయం బలమైనదన్నారు. ధర్మం లోతుగా ఉంది. లోతుగా ఉండ బోతుందన్నారు. మురుగ భక్తర్గల్ మానాడు నిర్వ‌హించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. నన్ను మధురైకి పిలిచింది మురుగన్, నన్ను పెంచింది మురుగన్, నాకు ధైర్యాన్ని ఇచ్చింది మురుగన్ అని పేర్కొన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఆ వేట్రివేల్ మురుగన్‌కు ఆరోగారా, వీరవేల్ మురుగన్‌కు రుణ‌ప‌డి ఉన్నాన‌ని చెప్పారు.

Comments (0)
Add Comment