Pawan Kalyan: ప్రధాని మోదీని కుటుంబ సమేతంగా కలిసిన పవన్ కళ్యాణ్ !

ప్రధాని మోదీని కుటుంబ సమేతంగా కలిసిన పవన్ కళ్యాణ్ !

Pawan Kalyan: 2014, 2019, 2024 లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలతో ముచ్చటగా మూడో సారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన వారసుడు అకీరా నందన్‌ ‌ను మోదీకి పరిచయం చేశారు. ఈ భేటీలో అకీరా నందన్ భవిష్యత్తు గురించి మోదీ సలహాలు, సూచనలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఫోటోలతో పాటు అకీరా నందన్ పేరు సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Pawan Kalyan Meet…

బుధవారం సాయంత్రం ఢిల్లీ లోని ప్రధాని నివాసంలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. మోదీ నివాసంలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హాజరయ్యారు. మోదీని ముచ్చటగా మూడోసారి ఎన్డీయే సారథిగా భాగస్వామ్య పక్షాల నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 9న మోదీ, కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ అలాగే 2 ఎంపీ స్థానాల్లోనూ ఘన విజయం సాధించి నూటికి నూరు శాతం సక్సెస్ రేట్‌ను సొంతం చేసుకుంది. పవన్ విజయం పై మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉంది.

ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ విజయంపై అకీరా నందన్ ఎడిట్ చేసిన ఓ వీడియో బాగా వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఆ వీడియోను అకీరా మదర్, పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఇల్లేమో దూరం.. అసలే చీకటి, గాడాంధకారం.. దారంతా గతుకులు.. చేతిలో దీపం లేదు.. కానీ గుండెల నిండా ధైర్యం ఉంది..’ అంటూ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మొదటి పొలిటికల్ సమావేశంలో చెప్పిన డైలాగ్‌తో ఈ వీడియో మొదలైంది. ఆ తర్వాత తమ్ముడు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఖుషి, అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్, తీన్‌మార్, గబ్బర్ సింగ్, పంజా, వకీల్ సాబ్, జల్సా సినిమాలలోని పవర్‌ఫుల్ సీన్లు తీసుకొని వీడియోని, బ్యాగ్రౌండ్‌లో మైకెల్ జాక్సన్ ఫేమస్ సాంగ్‌తో అకీరా ఎడిట్ చేసిన తీరు నిజంగా ఫ్యాన్స్‌కు అయితే గూజ్‌బంప్స్ తెప్పిస్తోంది. అకీరా నందన్ టాలెంట్‌కు మెగాభిమానులే కాకుండా.. నెటిజన్లు ఎందరో ఫిదా అవుతున్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అకీరా నందన్ పేరు సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Also Read : Megastar Chiranjeevi: చిరంజీవికి పవన్ కళ్యాణ్ పాదాభివందనం !

pawan kalyanPM Narendra Modi
Comments (0)
Add Comment