OG : ఈ ఏడాదిలోనే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ(OG) మూవీని రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగి పోయాయి. దేశ వ్యాప్తంగా స్టార్ ఇమేజ్ కలిగిన నటుడు తను. ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తూనే ఇంకో వైపు మూవీస్ పై ఫోకస్ పెట్టాడు. తను నటిస్తున్న మరో చిత్రం హరి హర వీరమల్లు సినిమా పూర్తి దశలో ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ కు మంచి స్పందన లభించింది.
Pawan Kalyan-OG Movie Updates
ఇందులో పవన్ కళ్యాణ్ పాట కూడా పాడారు. మే 9న విడుదల చేస్తామని ప్రకటించారు నిర్మాత ఎంఎం రత్నం. దీనికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ కీ రోల్ పోషిస్తోంది.
ఇక మరో చిత్రం ఓజీ. ఇది ఎప్పుడో పట్టాలు ఎక్కాల్సి ఉంది. అయితే ఎన్నికలు రావడంతో కొంత గ్యాప్ ఏర్పడింది. ఇందుకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా ఓజీ అంటూ ఫ్యాన్స్ కేకలు వేస్తున్నారు. గోల చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను ప్రేమించే అభిమానులు కోకొల్లలు.
దీంతో తను ఇప్పటికే అనౌన్స్ చేశాడు. ఓజీ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ప్రకటించాడు. పవర్ స్టార్ చేసిన కామెంట్స్ తో ఒక్కసారిగా ఈ మూవీపై నమ్మకం పెరిగింది. ఇక ఓజీ మూవీకి ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈసినిమాకు సంబంధించి ఓ వీడియో గ్లింప్స్ ను మాత్రమే రిలీజ్ చేశారు. తాజాగా జరిగిన ఈవెంట్ లో థమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పవన్ కల్యాణ్ షూటింగ్ లో పాల్గొనే రోజే ఓజీ ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తామని ప్రకటించాడు. దీంతో ఫ్యాన్స్ సంతోషానికి లోనవుతున్నారు.
Also Read : Hero Pawan Kalyan-Gopichand :పవర్ స్టార్ తో దమ్మున్న డైరెక్టర్ మూవీ..?