Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’ కోసం పాట పాడిన పవన్‌ కళ్యాణ్‌ ?

‘హరి హర వీరమల్లు’ కోసం పాట పాడిన పవన్‌ కళ్యాణ్‌ ?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘హరిహర వీరమల్లు’. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా… బాబీ డియోల్ , నిధి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. క్రిష్‌ జాగర్లమూడి ముందుగా ఈ సినిమాను ప్రారంభించినప్పటికీ… సగానికి పైగా షూటింగ్ అయిన తరువాత అనివార్య కారణాలతో ఆయన ఆ బాధ్యతల నుండి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమానున 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే వీరోచిత బందిపోటుగా పవన్ కనిపించనున్నట్లు సమాచారం. “హరి హర వీర మల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్” పేరుతో విడుదల చేసిన మొదటి భాగానికి “ధర్మం కోసం యుద్ధం” అనే ట్యాగ్ లైన్ ఉంది. ఈ పోస్టర్ సినిమాలపై అంచనాలను భారీగా పెంచేసింది.

Pawan Kalyan Movie Updates

ఏపీ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించి రాజకీయాల్లో బిజీగా మారిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan)… ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. విజయవాడలో ప్రస్తుతం కీలక పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా నుండి కీలకమైన అప్ డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ‘తమ్ముడు’,‘జానీ’, ‘కాటమరాయుడు’, ‘ఖుషి’ మొదలుకొని కుదిరినప్పుడల్లా ఆయన గొంతు సవరించుకునే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కోసం మైక్‌ తో ముందుకొస్తున్నట్లు సమాచారం. ‘హరి హర వీరమల్లు’ కోసం కూడా ఆయన ఓ పాట పాడినట్టు తెలిసింది. కీరవాణి స్వరకల్పనలోని ఆ పాటని ఇప్పటికే పవన్‌కల్యాణ్‌ ఆలపించడంతోపాటు, చిత్రీకరణ కూడా పూర్తి చేశారని, అది సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం.

Also Read : Simbu: ఆ హీరోయిన్‌ తో పెళ్లికి రెడీ అవుతున్న శింబు ?

AM RatnamHari Hara Veera MalluMM Kiravanipawan kalyan
Comments (0)
Add Comment