Payal Rajput: రిషబ్ శెట్టి వెంటపడుతున్న పాయల్ రాజపుత్

రిషబ్ శెట్టి వెంటపడుతున్న పాయల్ రాజపుత్

Payal Rajput : చిన్న సినిమాగా రిలీజై… ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ‘కాంతారా: ది లెజెండ్‌’. ప్రముఖ కన్నడ హీరో రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాల బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీనితో ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతారా: చాప్టర్‌-1’ రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ ప్రీక్వెల్ కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేసిన చిత్ర యూనిట్… ఈ ఇందులో నటీనటుల కోసం ఆడిషన్స్‌ మొదలు పెట్టారు. అయితే ఈ సినిమాలో తనకు అవకాశం ఇస్తే నటిస్తానంటూ క్రేజీ హీరోయిన్ పాయల్ రాజపుత్(Payal Rajput) సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది.

Payal Rajput – ‘కాంతారా-1’ ఛాన్స్ ఇవ్వాలంటూ ఎక్స్ ద్వారా కోరిన పాయల్

‘‘కాంతారా: చాప్టర్‌-1’ కోసం ఆడిషన్స్‌ జరుగుతున్నాయని నాకు తెలిసింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలని నాకు ఆశగా ఉంది. ఇటీవల విడుదలైన నా చిత్రం ‘మంగళవారం’లో నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. మీరు కాస్త సమయం వెచ్చించి నేను నటించిన సినిమా చూస్తే, మీకు కృతజ్ఞతలు చెప్పుకొంటాను. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఆడిషన్‌ ఇవ్వడానికి ఏం చేయాలో దయచేసి చెప్పండి అంటూ ఎక్స్‌ వేదికగా హీరో రిషబ్‌శెట్టి, చిత్ర నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్‌కు ట్వీట్‌ చేసింది. అంతేకాదు నా పేరు రీపోస్ట్‌ చేస్తూ సహకరించే అభిమానులకు నా ధన్యవాదాలు’’ అని పాయల్‌ రాజ్‌పుత్‌ తెలిపింది.

పాయల్ కు అవకాశం ఇవ్వండంటూ అభిమానుల రీ ట్వీట్

పాయల్‌ రాజ్‌పుత్‌ పోస్టుపై స్పందించిన పలువురు నెటిజన్లు ఆ ట్వీట్ ను రీట్వీట్‌ చేస్తూ ‘ఆమెను తీసుకోండి. మంగళవారంలో ఆమె బాగా నటించింది’, ‘మంగళవారంలో శైలులాంటి పాత్ర పాయల్‌ మాత్రమే చేయగలదు. ఆమె ట్వీట్‌కు రిప్లై ఇవ్వగలరు’ అంటూ రిషబ్‌శెట్టి, హోంబాలే ఫిల్మ్స్‌ను ట్యాగ్‌ చేస్తున్నారు. మరి పాయల్‌ రాజ్‌పుత్‌ కోరినట్లు ఆడిషన్స్‌కు ఆహ్వానిస్తారా ? ఒకవేళ ‘కాంతారా: చాప్టర్‌-1’లో నటించాల్సి వస్తే ఏ పాత్రకు అవకాశం దక్కుతుంది. తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే ! ప్రస్తుతం పాయల్‌ రాజ్‌పుత్‌ ‘గోల్‌మాల్‌’, ‘ఏంజెల్‌’, ‘కిరాతక’ అనే మూడు సినిమాల్లో నటిస్తోంది.

Also Read : Kalyanram Devil: వచ్చేసింది ‘డెవిల్’ థియేట్రికల్ ట్రైలర్

Kantara Chapter 1Payal Rajput
Comments (0)
Add Comment