PM Modi Important Meeting :పాకిస్తాన్ కాల్పుల విర‌మ‌ణ ఉల్లంఘ‌న

ప్ర‌ధాని నివాసంలో హైలెవ‌ల్ మీటింగ్

PM Modi : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నివాసంలో హైలెవ‌ల్ మీటింగ్ జ‌రిగింది. ఈ స‌మావేశానికి కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా తో పాటు జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్, త్రివిధ ద‌ళల అధిప‌తులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా పాకిస్తాన్ మ‌రోసారి క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్పడుతుండ‌డం ప‌ట్ల చ‌ర్చ‌కు వ‌చ్చింది. కాల్పుల విర‌మ‌ణ కు తూట్లు పొడిచిందంటూ మండిప‌డ్డారు.

PM Modi Important Meeting

ఈ సంద‌ర్బంగా భార‌త్, పాకిస్తాన్ స‌రిహ‌ద్దుల్లో నెల‌కొన్న ఉద్రిక్త వాతావ‌ర‌ణం గురించి ప్ర‌ధాని మోదీకి(PM Modi) వివ‌రించారు అజిత్ దోవ‌ల్. జై శంక‌ర్ కూడా పాల్గొన్నారు. కీల‌క సూచ‌న‌లు చేశారు. యావ‌త్ ప్ర‌పంచంలో రెండు మూడు దేశాలు త‌ప్పా అన్ని దేశాలు భార‌త్ తీసుకున్న నిర్ణ‌యానికి మ‌ద్ద‌తు తెలిపాయ‌ని చెప్పారు. అయితే పాకిస్తాన్ కావాల‌ని ఉగ్ర‌మూక‌ల‌కు స‌పోర్ట్ చేస్తోంద‌ని, ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషిస్తోందంటూ ఆరోపించారు. ఈ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా ఈనెల 12న పాకిస్తాన్, భార‌త దేశాల మ‌ధ్య కీల‌క చ‌ర్చ‌ల‌కు తెర లేప‌నున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్ల‌డించారు. ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఇరు దేశాల డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ మిల‌ట‌రీ ఆప‌రేష‌న్స్ (డీజీఎంఓలు మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇదిలా ఉండ‌గా మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు హాట్ లైన్ లో చ‌ర్చ‌లు జ‌రుగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : AICC Chief Kharge Sensational :వెంట‌నే అఖిల‌ప‌క్షం నిర్వ‌హించండి

Key MeetingPM Narendra ModiUpdatesViral
Comments (0)
Add Comment