PM Modi Shocking Comment :ఉగ్ర‌వాదంపై ఉక్కుపాదం – మోదీ

ఖ‌తార్..భార‌త దేశాల మ‌ధ్య బిగ్ డీల్

PM Modi : ఢిల్లీ – ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. యావ‌త్ ప్ర‌పంచం ప్ర‌స్తుతం ఉగ్ర‌వాదంతో స‌త‌మ‌తం అవుతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనిపై ఉక్కుపాదం మోపాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అన్ని దేశాలు ఒకే తాటిపైకి రావాల‌ని పిలుపునిచ్చారు. ఖ‌తార్ అధ్య‌క్షుడు భార‌త్ లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఇండియా, ఖ‌తార్ దేశాలు గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఏకంగా 28 ల‌క్ష‌ల బిలియ‌న్ డాల‌ర్ల దిశ‌గా ల‌క్ష్యంగా నిర్దేశించుకున్నాయి. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగించారు.

PM Modi Shocking Comments

ఉగ్ర‌వాదం పెను ముప్పుగా మారింద‌న్నారు. సమాచారం, నిఘా భాగస్వామ్యం, చట్టాల అమలు, మనీలాండరింగ్​కు వ్యతిరేకంగా పోరాడటం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్​ నేరాలు, అంతర్జాతీయ నేరాలకు సంబంధించి సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై చ‌ర్చించ‌డం జ‌రిగింద‌న్నారు.

ఖతార్‌ పాలకుడు షేక్‌ తమీమ్‌తో ఫలవంతమైన చర్చలు జరిగాయని నరేంద్ర మోదీ అన్నారు. ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరించ మెరుగు పరుచుకున్నందున్న షేక్ తమీమ్​ పర్యటన మరింత ప్రత్యేకమైనదని చెప్పారు. ఖతార్​ పాలకుడిని తన సోదరుడిగా అభివర్ణించిన మోదీ, సమావేశంలో ప్రధానంగా వాణిజ్యం గురించి చర్చించినట్లు తెలిపారు. ఇంతేకాకుండా ఇరు దేశాలు వాణిజ్యం సంబంధాలను బలోపేతం, విస్తృతం చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు.

Also Read : Popular Actress Shabana Azmi :ష‌బానా..జ్యోతిక ‘డ‌బ్బా కార్టెల్’ వైర‌ల్

BreakingCommentsNational NewsPM Narendra ModiViral
Comments (0)
Add Comment