PM Modi Strong Counter :ట్రంప్ కామెంట్స్ మోదీ సీరియ‌స్

మీ మ‌ధ్య‌వ‌ర్తిత్వం మాకు అవ‌స‌రం లేదు

PM Modi : న్యూఢిల్లీ – భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi). ఆప‌రేష‌న్ సిందూర్ స‌క్సెస్ లో భార‌త త్రివిధ ద‌ళాలు పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు. ఎట్టి ప‌రిస్థితుల‌లో ఇంకొక‌రి ప్ర‌మేయాన్ని స‌హించ బోమంటూ హెచ్చ‌రించారు.

PM Modi Strong Counter to Trump

ఆయ‌న ప‌రోక్షంగా త‌న చిర‌కాల మిత్రుడిగా పేర్కొంటున్న అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సీరియ‌స్ గా కౌంటర్ ఇచ్చారు. త‌న మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌ల్ల‌నే ఇరు దేశాలు కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి ఒప్పుకున్నాయంటూ ఇటీవ‌లే మీడియా ముందు వెల్ల‌డించారు ట్రంప్. దీనిని సీరియ‌స్ గా తీసుకుంది భార‌త్.

త‌మ సార్వ‌భౌమ‌త్వానికి భంగం క‌లిగిస్తే చూస్తూ ఊరుకునేది లేద‌న్నారు మోదీ. తాము ఎవ‌రిపై ఆధార ప‌డ‌డం లేద‌న్నారు. ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఆర్థిక‌, ప్ర‌జాస్వామిక దేశంగా ఉంద‌ని ఆ విష‌యాన్ని మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. ఇదే స‌మ‌యంలో భార‌త్ పై ఏ దేశ‌మైనా క‌న్నెత్తి చూసినా ఊరుకోమంటూ హెచ్చ‌రించారు మోదీ.

Also Read : India Shocking :పాకిస్థాన్ హైకమిషన్‌ ఉద్యోగి బహిష్కర‌ణ

BreakingCommentsDonald Trump.newsPM ModiViral
Comments (0)
Add Comment