Pooja Hegde Shocking :ఆ డైరెక్ట‌ర్ మేక‌ప్ లేకుండా ర‌మ్మ‌న్నాడు

కార్తీక్ సుబ్బ‌రాజ్ పై పూజా హెగ్డే కామెంట్స్

Pooja Hegde : జ్యోతికా, సూర్య ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన చిత్రం రెట్రో. త‌మిళ సినీ రంగంలో టాప్ డైరెక్ట‌ర్ కార్తీక్ సుబ్బ‌రాజ్ దీనిని తీశాడు. ఇప్ప‌టికే పోస్ట‌ర్స్, టీజ‌ర్, ట్రైల‌ర్, సాంగ్స్ కెవ్వుకేక అనిపించేలా ఉండ‌డంతో అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. గ‌తంలో త‌మిళం, తెలుగు సినిమాల‌లో న‌టించి టాప్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే ఉన్న‌ట్టుండి కొంత గ్యాప్ తీసుకుంది. ఈ మ‌ధ్య‌న హిందీలో న‌టించిన మూవీస్ కూడా అంత‌గా ఆడ‌లేదు. స‌ల్మాన్ ఖాన్, షాహిద్ క‌పూర్ తో న‌టించినా వ‌ర్క‌వుట్ కాలేదు. దీంతో త‌ను ఐరెన్ లెగ్ అంటూ కొంద‌రు కామెంట్స్ చేయ‌డం మొద‌లు పెట్టారు.

Pooja Hegde Shocking Comments

ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి స్పెష‌ల్ డైరెక్ట‌ర్ కార్తీక్ సుబ్బ‌రాజ్ నుంచి పిలుపు వ‌చ్చింది త‌న‌కు. ఈ సంద‌ర్బంగా సినిమాలో ఎంపిక‌కు సంబంధించి త‌న అనుభ‌వాన్ని పంచుకుంది పూజా హెగ్డే(Pooja Hegde). చిట్ చాట్ సంద‌ర్బంగా త‌న మ‌న‌సులోని భావాల‌ను బ‌య‌ట పెట్టింది. త‌ను ఎంద‌రో ద‌ర్శ‌కువ‌ల వ‌ద్ద ప‌ని చేశాన‌ని కానీ కార్తీక్ సుబ్బ‌రాజ్ లాంటి ద‌ర్శ‌కుడిని చూడ‌లేద‌ని తెలిపింది. రెట్రో సినిమా ఎలా పూర్తి చేశామో తెలియ‌కుండా కాలం గ‌డిచి పోయింద‌ని పేర్కొంది న‌టి. ఇది త‌న జీవితంలో మ‌రిచి పోలేని మూవీగా నిలిచి పోతుందని ధీమా వ్య‌క్తం చేసింది పూజా హెగ్డే.

రెట్రో మూవీ సెలెక్ష‌న్ కు సంబంధించి తాను ద‌ర్శ‌కుడి ముందుకు వెళ్లాన‌ని, ఎలాంటి మేక‌ప్ లేకుండా రావాలంటూ కార్తీక్ సుబ్బ‌రాజ్ చెప్పాడ‌ని తెలిపింది. తాను ముందుగా షాక్ కు గుర‌య్యాన‌ని ఆ త‌ర్వాత తేరుకున్నాన‌ని చెప్పింది పూజా హెగ్డే. రెట్రోలో త‌న‌ను అద్భుతంగా తెర మీద చూపించే ప్ర‌య‌త్నం చేశాడ‌ని, త‌న టేకింగ్, మేకింగ్ అద్భుతం అంటూ కొనియాడింది. ఇదిలా ఉండ‌గా కార్తీక్ సుబ్బ‌రాజ్ ఏ సినిమా తీసినా అందులో హీరోయిన్లు ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిత్వాన్ని క‌లిగి ఉంటారు. అందుకే అంద‌రూ త‌న‌ను ఇష్ట‌ప‌డ‌తారు.

Also Read : Hero Jr NTR-Dragon :డ్రాగ‌న్ కోసం బ‌రువు త‌గ్గిన తార‌క్

Commentskarthik subbarajPooja HegdeShockingViral
Comments (0)
Add Comment