Beauty Pooja Hegde : తెలుగులో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ

దుల్క‌ర్ స‌ల్మాన్ తో బుట్టబొమ్మ కీ రోల్

Pooja Hegde : బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గురించి కీల‌క అప్ డేట్ వ‌చ్చేసింది. ఈ మ‌ధ్యన తెలుగు సినిమాల నుంచి దూర‌మై బాలీవుడ్ కు వెళ్లి పోయిన ఈ ముద్దుగుమ్మ త్వ‌ర‌లో కొత్త ప్రేమ క‌థ ప్ర‌ధానంగా చిత్రంలో న‌టించ‌నుంది. ఈ విష‌యాన్ని క‌న్ ఫ‌ర్మ్ చేసింది. తాజాగా త‌ను త‌మిళంలో సూర్యతో జ‌త‌క‌ట్టిన చిత్రం రెట్రో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. త‌ను సినిమా కెరీర్ తొలిసారిగా కోలీవుడ్ లోనే స్టార్ట్ అయ్యింది. ఆ త‌ర్వాత తెలుగులోకి వ‌చ్చింది. స్టార్ హీరోల‌తో న‌టించింది.

Pooja Hegde Got Chance from Telugu

జూనియ‌ర్ ఎన్టీఆర్ తో క‌లిసి అర‌వింద స‌మేత‌లో కీ రోల్ పోషించింది పూజా హెగ్డే(Pooja Hegde). అల్లు అర్జున్ తో క‌లిసి దువ్వాడ జ‌గ‌న్నాథం, అల వైకుంఠ‌పురంలో , మ‌హేష్ బాబుతో క‌లిసి శ్రీ‌మంతుడులో న‌టించింది. ప్ర‌భాస్ తో క‌లిసి రాధే శ్యామ్ లో త‌ళుక్కున మెరిసింది. త్రివిక్ర‌మ్ త‌న‌తో సినిమా చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఎందుక‌నో త‌న‌ను త‌ప్పించేశారు. ఆ మూవీనే గుంటూరు కారం. ఇందులో ముందుగా పూజా హెగ్డే కీ రోల్ పోషించాల్సి ఉంది. త‌న స్థానంలో శ్రీ‌లీల న‌టించింది. ఇది బిగ్ హిట్ అయ్యింది.

ఆ త‌ర్వాత త‌నను ఎందుకు త‌ప్పించారో తెలియ‌డం లేదంటూ వాపోయింది పూజా హెగ్డే. ఈ త‌రుణంలో త‌న‌కు రెట్రో మంచి ఊపును ఇచ్చేలా చేస్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉంది. ఈ సినిమా వ‌చ్చే మే 1వ తేదీన విడుద‌ల కానుంద‌ని ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్. తాజాగా మరో కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. త‌నే స్వ‌యంగా తెలిపింది. దుల్క‌ర్ సినిమాతో క‌లిసి ల‌వ్ క‌థాంశంగా తెర‌కెక్కే మూవీలో న‌టించ‌నున్న‌ట్లు తెలిపింది. దీనికి ర‌వి అనే కొత్త యువ ద‌ర్శ‌కుడు డైరెక్టు చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

Also Read : Hero Mahesh Babu :26న మ‌హేష్ భ‌ర‌త్ అనే నేను రీ రిలీజ్

Comments (0)
Add Comment