Prabhas Kannappa : ‘క‌న్న‌ప్ప‌’లో ప్ర‌భాస్ క‌న్ ఫ‌ర్మ్

మంచు విష్ణుతో క‌లిసి న‌టించే ఛాన్స్

Prabhas Kannappa : పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఆధ్యాత్మిక నేప‌థ్యం క‌లిగిన పాత్ర‌ల‌కు ప్ర‌యారిటీ ఇస్తున్నారా. అవున‌నే అంటున్నాయి సినీ వ‌ర్గాలు. తాజాగా మంచు మోహ‌న్ బాబు త‌న‌యుడు మంచు విష్ణు క‌న్న‌ప్ప చిత్రం చేస్తున్నాడు. తాజాగా డార్లింగ్ ప్ర‌భాస్ ఈ సినిమాలో న‌టించేందుకు ఒప్పుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Prabhas Kannappa Movie

మంచు విష్ణుతో క‌లిసి ప్ర‌భాస్(Prabhas) న‌టించ‌నున్నారు. ఇందులో శివుడిగా న‌టిస్తున్న‌ట్లు టాక్. ఈ క‌న్న‌ప్ప చిత్రంలో కృతీ స‌న‌న్ సోద‌రి నూపుర్ స‌న‌న్ న‌టిస్తోంది. ఈ ఏడాది ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆది పురుష్ లో న‌టించాడు ప్ర‌భాస్.

ఇక డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స‌లార్ లో పాన్ ఇండియా స్టార్ న‌టించారు. ఆయ‌న‌కు జోడీగా శ్రుతీ హాస‌న్ న‌టించారు. సెప్టెంబ‌ర్ 28న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేసేందుకు మూవీ మేక‌ర్స్ డిసైడ్ చేశారు.

మ‌రో వైపు పాన్ ఇండియా డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో క‌ల్కి సినిమా చేస్తున్నాడు. ప్ర‌స్తుతం బిజీ షెడ్యూల్ కొన‌సాగుతోంది. భార‌త దేశంలో అత్య‌ధిక బ‌డ్జెట్ తో దీనిని తెర‌కెక్కించే ప్ర‌య‌త్న‌లో ఉన్నాడు డైరెక్ట‌ర్.

ఇదిలా ఉండ‌గా క‌న్న‌ప్ప చిత్రంలో ప్ర‌భాస్ న‌టిస్తున్న విష‌యాన్ని ధ్రువీక‌రించారు న‌టుడు మంచు విష్ణు.

Also Read : Jawan Movie : రూ. 300 కోట్ల క్ల‌బ్ లోకి జ‌వాన్

Comments (0)
Add Comment