Prabhas : వేసవి వచ్చిందంటే చాలు చాలా మంది హీరో హీరోయిన్లు, దర్శకులు తమకు ఇష్టమైన ప్రదేశాలకు వెళతారు. ఇది ఎప్పటిలాగా జరుగుతున్నదే. మహేష్ బాబు తన ఫ్యామిలీతో వెళ్లి వచ్చేశాడు. ఇదే సమయంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్(Prabhas) ఇప్పుడు వేసవి కావడంతో సేద దీరేందుకు ఇటలీకి వెళ్లాడు. అక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నాడు. తను నాగ్ అశ్విన్ కల్కి-2 లో నటించేందుకు రెడీగా ఉన్నాడు. ఇక దర్శకుడు మారుతి తీస్తున్న రాజా సాబ్ లో లవర్ బాయ్ పాత్ర పోషించాడు. ఇది షూటింగ్ పూర్తయింది.
Prabhas in Italy
ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఇంకా పూర్తి కావడానికి కొంత సమయం పడుతుందని మారుతి ఇటీవలే ప్రకటించాడు. ఎప్పుడు వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ కళ్లల్లో వత్తులు వేసుకుని చూస్తున్నారు. ఇక బిజీ షూటింగ్ షెడ్యూల్ నుంచి కాస్తంత రిలీఫ్ పొందేందుకు తను ఇటలీని ఎంచుకున్నాడు. రాజా సాబ్ , ఫౌజీ చిత్రాలలో కీ రోల్ పోషిస్తున్నాడు. తన రాబోయే ప్రాజెక్టులకు సంబంధించి తిరిగి షూటింగ్ లో నిమగ్నం అయ్యేందుకు రెస్ట్ తీసుకుంటున్నట్లు టాక్. తిరిగి ఇటలీ నుంచి జూన్ లో రానున్నాడు. అప్పటి దాకా దర్శక, నిర్మాతలు సినిమాల పూర్తిపై ఫోకస్ పెట్టనున్నారు.
ఇక ప్రభాస్ విషయానికి వస్తే ప్రతి ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువ కాలం సినిమాలకు దూరంగా ఉంటాడు. ప్రస్తుతానికి మారుతీ తీస్తున్న రాజా సాబ్ కు సంబంధించి కీలక సన్నివేశాలు కొన్ని మిగిలి ఉన్నాయని, తను ఇటలీ నుంచి వచ్చాక వాటిని చిత్రీకరిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని నిర్మాణ బృందం కూడా ధ్రువీకరించింది. రాజా సాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సంచలనం సృష్టించింది. ప్రభాస్ ను ఎప్పుడూ గతంలో చూడని విధంగా దర్శకుడు కొత్త గెటప్ లో చూపించనున్నాడు.