Anchor- Hero Pradeep :అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి సాంగ్ రిలీజ్

ప్ర‌దీప్ మాచిరాజు..దీపిక పిల్లి కీల‌క పాత్ర‌ల‌లో న‌ట‌న

Pradeep : యాంక‌ర్ నుంచి యాక్ట‌ర్ గా మారిన ప్ర‌దీప్ మాచిరాజు(Pradeep), దీపిక‌పిల్లి క‌లిసి న‌టించిన తాజా చిత్రం అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి. గ‌తంలో ఇదే పేరుతో సూప‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించాడు. అప్ప‌ట్లో ఆ సినిమా బిగ్ స‌క్సెస్. నితిన్, భ‌ర‌త్ క‌లిసి ఈ సినిమాను తెర‌కెక్కించారు. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా చిత్రీక‌ర‌ణ ఉండ‌టంతో పాజిటివ్ టాక్ వ‌చ్చింది. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్, టీజ‌ర్ , ఓ సాంగ్ ఫీల్ గుడ్ అనిపించేలా ఉంది. తొలి పాట ఆక‌ట్టుకుంది. పిక్చ‌రైజేష‌న్ మ‌రింత బాగుండ‌టంతో మూవీ మేక‌ర్స్ రెండో సాంగ్ ను విడుద‌ల చేశారు.

Anchor Pradeep Akkada Ammai Ikkada Abbai Song

అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి చిత్రం ట్రైల‌ర్ కు బిగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ర‌థ‌న్ ఈ మూవీకి సంగీతం ఇచ్చారు. తాజాగా రిలీజ్ చేసిన సాంగ్ ను రాకేందు మౌళి రాయ‌గా శ‌ర‌త్ సంతోష్, లిప్సిక అద్భుతంగా ఆలాపించారు. ఇది పూర్తిగా ప్రేమ‌తో హీరో హీరోయిన్లు పాడుకునేలా ఉంది. సాహిత్యం వీర లెవ‌ల్లో ఉంది. చిత్రీక‌ర‌ణ సింప్లీ సూప‌ర్ గా ఉంది. లొకేష‌న్స్ కూడా అందంగా ఆక‌ట్టుకునే ఉన్నాయి.

ఇక ప్ర‌దీప్ మాచిరాజు త‌న కెరీర్ ను ప్ర‌యోక్త‌గా స్టార్ట్ చేశాడు. ఆ త‌ర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇటు బుల్లితెర అటు వెండి తెర మీద ఫోక‌స్ పెట్టాడు. గ‌తంలో 30 రోజుల్లో ల‌వ్ చేయ‌డం ఎలా అనే చిత్రంలో న‌టించాడు. ఆ మూవీ రిలీజ్ అయినా ఆశించినంత మేర ఆడ‌లేదు. ప్ర‌స్తుతం త‌న ఫ్రెండ్స్ తో క‌లిసి సినిమా నిర్మించారు.

Also Read : Hero Dhanush-Idli Kadai :ద‌స‌రాకు రానున్న ధ‌నుష్ ఇడ్లి క‌డై

CinemaPradeep MachirajuTrendingUpdates
Comments (0)
Add Comment