Pradeep Ranganathan : తమిళ సినీ రంగంలో తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ స్వంతం చేసుకున్నాడు యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్. తను నటుడే కాదు రచయిత, దర్శకుడు కూడా. తను నటించిన లవ్ టుడే కుర్రకారును షేక్ చేసింది. ఆ తర్వాత మారి ముత్తు దర్శకత్వం వహించి, తను కథగా రాసిన మూవీ డ్రాగన్ కలెక్షన్ల వర్షం కురిపించింది. బాక్సులు బద్దలు కొట్టేలా చేసింది. ఇటు తమిళంలో అటు తెలుగులో బిగ్ సక్సెస్ ను మూటగట్టుకుంది.
Pradeep Ranganathan – Mamitha Baiju Dude Movie Look
అంతే కాదు ఓటీటీలో సైతం సూపర్ రేటింగ్ ను సాధించింది. ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) నటన సినిమాకు హైలెట్ గా నిలవగా తనతో నటించిన కయాదు లోహర్ డ్రాగన్ మూవీతో దేశ వ్యాప్తంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారి పోయింది. తాజాగా ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న మరో చిత్రం డ్యూడ్. ఇందులో మమతా బైజు నటిస్తోంది. మొన్న ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా సూపర్ స్పందన వచ్చింది. ఇప్పుడు ఇదే మూవీ నుంచి సెకండ్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
ఇది కెవ్వు కేక అనిపించేలా ఉందంటున్నారు ఫ్యాన్స్. మొత్తంగా ప్రదీప్ రంగనాథన్ ఏది చేసినా అది ఓ సంచలనంగా మారేలా కనిపిస్తోంది. ఈ డ్యూడ్ చిత్రాన్ని నిర్మిస్తోంది టాలీవుడ్ కు చెందిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఇప్పటికే ఈ సంస్థ నుంచి వచ్చిన పుష్ప 2 సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా రూ. 1867 కోట్లను రాబట్టింది. దేశంలోనే అత్యధిక రెండో మూవీ గా నిలిచింది. ఈ డ్యూడ్ చిత్రానికి కీర్తీశ్వరన్ అనే నూతన దర్శకుడిని పరిచయం చేశారు. తనకు ఇచ్చిన ఛాన్స్ ను అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు.
Also Read : Hero Naga Shaurya :నాగ శౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్ షూటింగ్ పూర్తి