Popular Dir Pradeep Ranganathan: డ్రాగ‌న్ ఫేమ్ ప్ర‌దీప్ డ్యూడ్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

దీపావ‌ళి రోజున ప్రేక్ష‌కుల ముందుకు మూవీ

Pradeep Ranganathan : మారి ముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం డ్రాగ‌న్. సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇందులో న‌టించిన అనుపమ ప‌ర‌మేశ్వ‌ర్, కయాదు లోహ‌ర్ ప్రాణం పోశారు. గ‌తంలో త‌ను న‌టించిన ల‌వ్ టుడేతో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్(Pradeep Ranganathan) ఉన్న‌ట్టుండి డ్రాగ‌న్ మూవీతో స్టార్ ఇమేజ్ స్వంతం చేసుకున్నాడు. తాజాగా త‌ను న‌టించిన మ‌రో మూవీ డ్యూడ్ షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో మూవీ మేక‌ర్స్ చిత్రానికి సంబంధించి ఫ‌స్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

Pradeep Ranganathan Dude Movie 1st Look

డ్యూడ్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. ఇప్ప‌టికే మూవీ మేక‌ర్స్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని విడుద‌ల చేస్తామ‌ని వెల్ల‌డించారు. దీంతో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. ఇక ఎప్ప‌టి లాగే ప్ర‌దీప్ రంగనాథ‌న్ డ్యూడ్ లో డిఫ‌రెంట్ గా క‌నిపించ బోతున్నాడు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్న ఈ న‌టుడు ఇప్పుడు ఈ చిత్రంపై భారీగా న‌మ్మ‌కం పెట్టుకున్నాడు.

ప్ర‌స్తుతం ప్ర‌ముఖ బ్యాన‌ర్ మైత్రీ మేక‌ర్స్ నిర్మించిన పాన్ ఇండియా వెంచ‌ర్ లో న‌టిస్తుండ‌డం విశేషం. రాబోయే ఈ చిత్రంలో కీర్తీశ్వ‌రన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. ఇప్ప‌టికే సూప‌ర్ డూప‌ర్ హిట్ గా పేరొందిన మూవీ ప్రేమ‌లు బ్యూటీ మ‌మిత బైజు డ్యూడ్ లో క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ కుమార్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషించ‌నున్నాడు. అధికారికంగా టైటిల్ ను ప్ర‌క‌టించారు. యువ‌త‌ను ఆక‌ట్టుకునేలా ఉంది ఫ‌స్ట్ లుక్. సాయి అభ్యాంక‌ర్ దీనికి సంగీతం అందిస్తుండ‌గా నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫ‌ర్ గా ఉన్నారు.

Also Read : Single Movie Sensational :సింగిల్ క‌మాల్ పైసా వ‌సూల్

CinemaDudePradeep RanganathanUpdatesViral
Comments (0)
Add Comment