Popular Director Prasanth Neel :రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన ప్ర‌శాంత్ నీల్

తార‌క్ తో మూవీ షూటింగ్ లో బిజీ

Prasanth Neel : తీసింది కొన్ని చిత్రాలే. కానీ దేశ వ్యాప్తంగా షేక్ చేశాడు క‌న్న‌డ సినీ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్. య‌శ్ తో తీసిన కేజీఎఫ్ రికార్డుల మోత మోగించింది. సీక్వెల్ క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. ప్ర‌భాస్ తో తీసిన స‌లార్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇప్పుడు పాన్ ఇండియా హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ తో సినిమా ప్ర‌క‌టించాడు. ఇప్ప‌టికే రంగంలోకి దిగాడు. షూటింగ్ మొద‌లు పెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లోని మంగళూరులో కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించే ప‌నిలో ప‌డ్డాడు.

Prasanth Neel Movie Updates

ఇక ప్ర‌శాంత్ నీల్(Prasanth Neel) వ‌ర్క్ డిఫ‌రెంట్ గా ఉంటుంది. త‌న టేకింగ్ కూడా ఇత‌ర ద‌ర్శ‌కుల‌కంటే భిన్నం కూడా.
డైన‌మిక్ డైరెక్ట‌ర్ , ద‌మ్మున్న హీరో క‌లిస్తే సినిమా ఎలా ఉంటుందోన‌ని ఉత్కంఠ నెల‌కొనేలా చేశాడు. ఇంకా సినిమానే పూర్తి కాలేదు అప్పుడే మార్కెట్ లో డిమాండ్ పెరిగింది ఈ మూవీపై. నా ఆలోచ‌న‌లు, క‌థ‌కు త‌గిన‌ట్టు తార‌క్ దొరికాడు. ఇక క‌థ వేరే లెవ‌ల్లో ఉంటుంద‌ని ప్ర‌క‌టించాడు ప్ర‌శాంత్ నీల్. త‌ను అనుకున్న‌ది సాధించేంత వ‌ర‌కు నిద్ర పోడు. త‌న‌తో ప‌ని చేయడం అంటే ఓ బిగ్ ఛాలెంజ్ ను స్వీక‌రించ‌డం.

ఈ కొత్త ప్రాజెక్టుకు ఎన్టీఆర్ నీల్ అని టైటిల్ ఫిక్స్ చేశాడు . వ‌చ్చే ఏడాది 2026 జూన్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తానంటూ వెల్ల‌డించాడు. దీంతో తార‌క్ , నీల్ ఫ్యాన్స్ తెగ సంబుర ప‌డి పోతున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నారు. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. మొత్తంగా రిలీజ్ కాకుండానే అంచ‌నాలు పెంచుతున్న నీల్ రేపొద్దున మూవీ రిలీజ్ చేశాక ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడో చూడాలి.

Also Read : Hero Satyadev-Zebra :ఓటీటీలో స‌త్య‌దేవ్..ధ‌నంజ‌య జీబ్రా

CinemaJr NTRprasanthneelUpdatesViral
Comments (0)
Add Comment