Hanuman Sequel Shocking : హ‌నుమాన్ సీక్వెల్ ఆల‌స్యం

రిష‌బ్ శెట్టి బిజీ షెడ్యూల్ కార‌ణం

Hanuman : త‌క్కువ బ‌డ్జెట్ తో తీసిన హ‌నుమాన్ దేశంలోనే సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ చిత్రానికి భారీ స్పంద‌న రావ‌డంతో మూవీ మేక‌ర్స్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. హ‌నుమాన్(Hanuman) కు సీక్వెల్ తీసుకు వ‌స్తున్న‌ట్లు తెలిపారు. ఇందులో కీ రోల్ పోషిస్తున్న‌ది ఎవ‌రో కాదు కాంతార చిత్రంతో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారిన క‌న్న‌డ న‌టుడు రిష‌బ్ శెట్టి. త‌ను బిజీ షెడ్యూల్ కార‌ణంగా టైమ్ కుదుర‌క పోవ‌డంతో హ‌నుమాన్ సీక్వెల్ చిత్రం షూటింగ్ లో ఆల‌స్యం అవుతోంది.

Hanuman Srquel Shocking Update

మ‌రో వైపు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ సైతం త‌దుప‌రి చిత్రంపై ఫోక‌స్ పెట్ట‌డంతో ఇంకా పట్టాలెక్కేందుకు నానా తంటాలు ప‌డుతోంది. ఇదిలా ఉండ‌గా హ‌నుమాన్ చిత్రానికి క‌థ రాయ‌డంతో ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. మ‌రో వైపు కాంతారా హిట్ కావ‌డంతో దానిని సీక్వెల్ తీసే ప‌నిలో బిజీగా ఉన్నాడు రిష‌బ్ శెట్టి.

ఇటు వ‌ర్మ అటు శెట్టి ఇద్ద‌రూ ఎవ‌రికి వారే ఫుల్ టైంలో ప‌డి పోవ‌డంతో హ‌నుమాన్ ప్రాజెక్టుపై ప్ర‌భావం ప‌డింది. ఇక ఫ్యాన్స్ మాత్రం తెగ ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఈ సినిమా గురించి అప్ డేట్ వ‌స్తుందా అని.

ఇదిలా ఉండ‌గా వ‌ర్మ ప్ర‌స్తుతం పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్ర‌భాస్ కు క‌థ చెప్పాడ‌ని, త‌న‌కు మెస్మ‌రైజ్ అయ్యాడ‌ని ఓకే కూడా చెప్పాడ‌ని టాక్. కాగా త‌ను ప్ర‌స్తుతం పాన్ ఇండియా డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డితో సినిమా చేస్తున్నాడు. అదే స్పిరిట్. గ‌త ఏడాది ర‌ణ బీర్ క‌పూర్ తో యానిమల్ తీశాడు. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. రూ. 1000 కోట్లు క‌లెక్ష‌న్స్ చేసి బాలీవుడ్ ను షేక్ చేసింది.

Also Read : Beauty Kayadu Lohar :డ్రాగ‌న్ బ్యూటీకి ఆఫ‌ర్ల వెల్లువ‌

hanumanSequelTrendingUpdates
Comments (0)
Add Comment