Preity Zinta: ఆరేళ్ళ తరువాత సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటా రీ ఎంట్రీ !

ఆరేళ్ళ తరువాత సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటా రీ ఎంట్రీ !

Preity Zinta:ఆరేళ్ల తర్వాత సినిమా సెట్స్‌ లోకి అడుగుపెట్టారు బాలీవుడ్‌ నటి, సొట్ట బుగ్గల సుందరి ప్రీతీ జింటా. సన్నీడియోల్‌ హీరోగా రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్ డ్రామా ‘లాహోర్‌ 1947’ తో ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారు. హీరో అమీర్‌ఖాన్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మహారాష్ట్ర సరిహద్దులోని లొకేషన్స్ లో నైట్‌ షూట్‌ జరుగుతోందని సమాచారం. తాజాగా ఈ సినిమాలో ప్రీతి జింటా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలపడమే కాకుండా… షూటింగ్ లో పాల్గొన్నట్లు తన సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు ప్రీతీ జింటా.

Preity Zinta Movie Updates

ఈ సంగతి ఇలా ఉంచితే… 2018లో రిలీజైన హిందీ చిత్రం ‘భయ్యాజీ సూపర్‌హిట్‌’ మూవీలో సన్నీడియోల్, ప్రీతీ జింటా జోడీగా నటించారు. ఆ సినిమా తర్వాత మరో మూవీలో నటించలేదు ప్రీతీజింటా. మళ్లీ ఇప్పుడు ‘లాహోర్‌ 1947’కు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారామె. ఇక ప్రీతీ జింటా తిరిగి సినిమాలు చేస్తుండటంతో ఆమె అభిమానులు ‘ప్రీతి ఈజ్‌ బ్యాక్‌’, ‘ప్రీతి రిటర్న్స్‌’ అంటూ పోస్ట్‌లు షేర్‌ చేస్తున్నారు.

Also Read : Amitabh Bachchan: లతా దీనానాథ్‌ మంగేష్కర్‌ పురస్కారాన్ని అందుకున్న బిగ్ బి అమితాబ్‌ !

Lahore 1947Preity ZintaSunny Deol
Comments (0)
Add Comment