Prithwiraj Sukumaran : కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా అవార్డులను ఇస్తుంది. 54వ కేరళ రాష్ట్ర పురస్కారాలను ప్రకటించింది. ఇందులో భాగంగా తన సహజసిద్దమైన నటనకు పేరు పొందిన నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithwiraj Sukumaran) కు అత్యుత్తమమైన నటుడి అవార్డుకు ఎంపికయ్యాడు. గల్ఫ్ దేశాలలో బతికేందుకు వెళ్లే వలసజీవులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లను చూపించే ప్రయత్నం చేశారు ఆడు జీవితం మూవీలో. ఈ సినిమా దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. చూసిన వారంతా కంటతడి పెట్టారు.
Prithwiraj Sukumaran Got Best Award
ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించాడు. ఇంకే నటుడు ఇలాంటి పాత్రను చేయలేడంటూ జ్యూరీ పేర్కొంది. కేరళ రాష్ట్ర ఉత్తమ నటుడి అవార్డును సీఎం పినరయి విజయన్ తో తీసుకున్నారు . ది గోల్ లైఫ్ లో నజీబ్ పాత్రను అద్భుతంగా నటించాడు. మలయాళ చిత్ర పరిశ్రమకు ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు తీసుకు వచ్చేలా చేశారంటూ సీఎం ప్రశంసలు కురిపించారు.
ఈ అత్యున్నతమైన అవార్డులను 2023 సంవత్సరానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అత్యుత్తమమైన ప్రదర్శనకు గాను ఈ పురస్కారాలను అందజేస్తోంది. తనకు ఉత్తమ నటుడిగా ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి, సినిమాను ఆదరించి, సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ప్రేక్షకులకు. గతంలో ప్రముఖ నటుడు మోహన్ లాల్ కూడా ఈ అవార్డును అందుకున్నారు. పలుమార్లు అందుకుని రికార్డు సృష్టించారు.
Also Read : Beauty Pooja Hegde : తెలుగులో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ