Priya Bhavani Shankar Interesting :బ‌న్నీ అంటే ఇష్టం దేనికైనా సిద్దం

న‌టి ప్రియ భ‌వానీ శంక‌ర్ కామెంట్స్ 

Priya Bhavani Shankar : ఇండియ‌న్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ప్ర‌పంచ వ్యాప్తంగా లెక్కించ లేనంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. త‌ను సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన పుష్ప‌-2 రికార్డ్ బ్రేక్ చేసింది. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. త‌న న‌ట‌న‌, మేన‌రిజం ప్ర‌తి ఒక్క‌రినీ ఇమిటేట్ చేసేలా చేసింది. ఇక బ‌న్నీకి సంబంధించి అన్ని వ‌ర్గాల‌కు చెందిన వారు అభిమానులుగా ఉన్నారు. త‌న‌తో న‌టించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు మ‌రికొంద‌రు హీరోయిన్లు.

Priya Bhavani Shankar Interesting Comments

ప్ర‌స్తుతం త‌ను వెకేష‌న్ టూర్ లో ఉన్నాడు. అక్క‌డి నుంచి వ‌చ్చాక మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్, త‌మిళ  సూప‌ర్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ తో పాటు బాలీవుడ్ కు చెందిన స్టార్ డైరెక్ట‌ర్ తో కూడా చ‌ర్చ‌లు జ‌రుపుతార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక పుష్ప బిగ్ స‌క్సెస్ కాగా పుష్ప‌2 దుమ్ము రేపింది. ఏకంగా రూ. 1876 కోట్లు వ‌సూలు చేసింది. న‌యా రికార్డ్ సృష్టించింది. బ‌న్నీ సినీ కెరీర్ లోనే ఈ చిత్రం టాప్ లో నిలిచింది.

ఇదిలా ఉండ‌గా టాలీవుడ్ కు చెందిన సినీ న‌టి ప్రియ భ‌వానీ శంక‌ర్(Priya Bhavani Shankar) షాకింగ్ కామెంట్స్ చేసింది. త‌న జీవితంలో ఒక్క‌సారైనా అల్లు అర్జున్ తో న‌టించాల‌ని, ఉంది వీలైతే కిస్ సీన్ కూడా చేసేందుకు సిద్ద‌మ‌ని పేర్కొంది. రొమాన్స్ చేసేందుకు అభ్యంత‌రం లేద‌ని ప్ర‌క‌టించింది. తాజాగా ఈ అమ్మ‌డు చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Also Read : Hero Chaitanya-Thandel OTT :మార్చి 14న ఓటీటీలో తండేల్ స్ట్రీమింగ్

allu arjunCommentsInteresting NewsPriya Bhavani ShankarViral
Comments (0)
Add Comment