Actor Priyadarshi Sensational :క‌ల నెర‌వేరింది సంతోషం మిగిలింది

విల‌క్ష‌ణ న‌టుడు ప్రియ‌ద‌ర్శి కామెంట్

Priyadarshi : విల‌క్ష‌ణ న‌టుడు ప్రియ‌ద‌ర్శి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న జీవితంలో ఓ క‌ల ఉండేద‌ని, అది ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ‌తో నెర‌వేరింద‌న్నాడు. త‌ను న‌టించిన తాజా చిత్రం సారంగ‌పాణి జాత‌కం(Sarangapani Jathakam). ఈ సినిమా ప్ర‌ధాన క‌థ‌. జాతకాల‌ను న‌మ్మ‌డం వ‌ల్ల ఏమీ కాద‌ని, కేవ‌లం క‌ష్టాన్ని న‌మ్ముకుంటే అనుకున్న‌ది సాధించ‌గ‌ల‌మ‌ని చెప్పాడు. ఈ చిత్రానికి ఓ ప్ర‌త్యేక‌త ఉంద‌న్నాడు. అదేమిటంటే ఈ సినిమాలో పూర్తిగా తెలుగు వారే న‌టించార‌ని తెలిపాడు.

Priyadarshi Sensational Comments

ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాను. త‌న‌కు ఛాన్స్ ద‌క్కుతుందా లేదా అన్న అనుమానం ఉండేద‌ని, కానీ మోహ‌న‌కృష్ణ‌తో న‌టించే కోరిక నెర‌వ‌డంతో సంతోషంగా ఉన్నాన‌ని పేర్కొన్నాడు. ఇందులో అద్భుత‌మైన పాత్ర త‌న‌కు ద‌క్కింద‌న్నాడు. ఇది ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటుంద‌ని, ఆ న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నాడు. ఈ చిత్రాన్ని నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మించాడు. జాత‌కాల కంటే చేసిన ప‌నుల‌పై ఫోక‌స్ పెడితే మంచిద‌ని అన్నారు.

ఇదిలా ఉండ‌గా సారంగ‌పాణి జాత‌కం ఏప్రిల్ 18న విడుద‌ల కానుంది . ఇందులో ప్రియదర్శితో పాటు రూప కొడువాయూర్, నరేశ్‌, తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 21న నటుడు విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదల చేయగా, డిసెంబరు 20న విడుదల కావాల్సివుండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. కాగా ప్రియద‌ర్శి తాజాగా నటించిన కోర్ట్ సెన్సేష‌న్ హిట్ గా నిలిచింది.

Also Read : Producer Naga Vamshi Shocking :నిజాయితీ రివ్యూస్ ను త‌ప్ప‌కుండా గౌర‌విస్తాం

CommentsPriyadarshi PulikondaSarangapani JathakamViral
Comments (0)
Add Comment