Hero Priyadarshi Movie : ఏప్రిల్ 18న సారంగపాణి జాత‌కం

మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌కంటి ద‌ర్శ‌క‌త్వం

Priyadarshi : తెలుగు సినీ రంగంలో స‌హ‌జ సిద్ద‌మైన న‌టుడిగా గుర్తింపు పొందారు ప్రియ‌ద‌ర్శి. త‌ను తాజాగా న‌టించిన చిత్రం కోర్ట్. దీనిని ప్ర‌ముఖ న‌టుడు నాని నిర్మించాడు. ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందు కు వ‌చ్చింది. అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇక ఇదే స‌మ‌యంలో ప్రియ‌ద‌ర్శి న‌టించిన మ‌రో చిత్రం సారంగ‌పాణి జాత‌కం విడుదల‌కు సిద్ద‌మ‌వుతోంది. మంచి టేస్ట్ క‌లిగిన ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందిన వ్య‌క్తి మోహ‌న కృష్ణ ఇంద్రగంటి. త‌ను ఏది తీసినా దానికి ఓ ప్ర‌యోజ‌నం ఉంటుంది. శ్రీ‌దేవి మూవీస్ చీఫ్ శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ దీనిని స‌మ‌ర్పించారు.

Priyadarshi Sarangapani Jathakam Movie Release Upates

‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత, వారిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడవ చిత్రంసారంగపాణి జాత‌కం(Sarangapani Jathakam). ప్రియదర్శి సరసన తెలుగు అమ్మాయి రూపా కొడువాయూర్ కథానాయికగా నటించింది. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘సారంగి సారంగస , ‘సాంచారి సంచారి’ అనే టైటిల్ సాంగ్ ట్రెండింగ్‌లో ఉండగా, టీజర్‌లోని సాహిత్యం, కామెడీ సన్నివేశాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ‘సారంగపాణి జాతకం’ గురించి మాట్లాడుతూ త్వ‌ర‌లోనే సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ చేసేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నామ‌న్నారు. ఏప్రిల్ 18న సినిమాను థియేట‌ర్ల‌కు తీసుకు వ‌స్తామ‌న్నారు. ఇంటిల్లిపాదిని న‌వ్వించేందుకు ప్ర‌య‌త్నం చేశాడ‌ని డైరెక్ట‌ర్ కు కితాబు ఇచ్చారు. ఇందులో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ అసరాల, ‘వెన్నెల’ కిషోర్, ‘వైవా’ హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, వెంకట్, రూప కె. మణి ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. సంగీతం వివేక్ సాగ‌ర్ అందించారు.

Also Read : Hyderabad Police Shocking :11 యూట్యూబ‌ర్ల‌పై కేసులు న‌మోదు

CinemaPriyadarshi PulikondaSarangapani JathakamTrendingUpdates
Comments (0)
Add Comment