Priyanka Chopra: ‘టైగర్‌’ కు డబ్బింగ్ చెప్పిన ప్రియాంక చోప్రా !

‘టైగర్‌’ కు డబ్బింగ్ చెప్పిన ప్రియాంక చోప్రా !

Priyanka Chopra: హాలీవుడ్‌, బాలీవుడ్‌ అని తేడా లేకుండా తన నటనా ప్రతిభను నిరూపించుకున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. వరుస హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ… ఇటీవల ఓ డాక్యుమెంటరీకు డబ్బింగ్ చెప్పంది. త్వరలో విడుదల కానున్న ‘టైగర్‌’ అనే డాక్యుమెంటరీలో అంబా అనే ఆడపులి పాత్రకు తన గొంతు అరువిచ్చింది. ఈ సందర్భంగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ ప్రాజెక్టు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసింది.

Priyanka Chopra Movie Update..

ఈ సందర్భంగా ప్రియాంక(Priyanka Chopra) మాట్లాడుతూ… ‘‘ప్రకృతికి సంబంధించిన సినిమాలకు నేను పెద్ద అభిమానిని. మనదేశం నుంచి వస్తున్న ‘టైగర్‌’ అనే కథను నా గొంతుతో ప్రేక్షకులకు దగ్గరవ్వడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. నేను ఒక నటిగా ఆడియో విజువల్‌ మాధ్యమానికి అలవాటు పడ్డాను. కానీ.. ఇప్పుడు కేవలం నా వాయిస్‌తోనే భావోద్వేగాలను పండించగలగాలి. తొలిసారి ఓ సరికొత్త పాత్రతో రాబోతున్నాను. నిజంగా ఇది సవాలుతో కూడిన పని. గళాన్ని అందించాలనే నా కోరిక ‘టైగర్‌’తో నెరవేరిందని చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా. అంతేకాదు ప్రేక్షకుల మనసుల్ని హత్తుకునేలా ఒక పాత్రకు సంబంధించిన భావోద్వేగాలను గళంలో వినిపించడం ఎంతో సవాలుతో కూడిన పని అని ఆమె స్పష్టం చేసింది. ఒక పులి ఎనిమిదేళ్ల జీవితం ఆధారంగా రాబోతున్న ‘టైగర్‌’ ఈ నెల 22న రానుంది.

ప్రస్తుతం ప్రియాంక చోప్రా… ఇద్రిస్‌ ఎల్బా, జాన్‌ సెనా, జాక్‌ క్వాయిడ్, స్టీఫెన్‌ రూట్‌ ప్రధాన పాత్రధారులుగా హాలీవుడ్‌ లో తెరకెక్కిస్తున్న ‘హెడ్స్‌ ఆఫ్‌ స్టేట్‌’ అనే కామెడీ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ లో నటిస్తోంది. ఇలియా నైషుల్లర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ఇటీవల చిత్రీకరణ అమెరికాలో మొదలైంది.

Also Read : Rajinikanth: రజనీ ‘తలైవా 171’ సినిమా టైటిల్‌ ‘కూలీ’ !

Priyanka ChopraTiger
Comments (0)
Add Comment