Priyanka Chopra : అమ్మ‌త‌నం అద్భుతం – ప్రియాంక‌

న‌టి సంచ‌ల‌న కామెంట్స్

ఇటు బాలీవుడ్ లో అటు హాలీవుడ్ లో దుమ్ము రేపుతోంది న‌టి ప్రియాంక చోప్రా. త‌న‌కు ఏది న‌చ్చితే అది వెంట‌నే నిర్మోహ మాటంగా చెప్పేందుకు వెనుకాడ‌దు. ప్ర‌తి ఇండ‌స్ట్రీలో ఏదో ఒక ర‌కంగా మ‌న‌ల్ని వెన‌క్కి లాగేవాళ్లు ఉంటారు. గేలి చేసే వాళ్లు ఎక్కువ‌గా తార‌స ప‌డ‌తారు. వాటిని ప‌ట్టించుకుని కూర్చుంటే మ‌న స‌మ‌యం త‌గ్గి పోతుంద‌ని న‌ర్మ గ‌ర్భంగా చెప్పేస్తారు.

తాజాగా ఇంట‌ర్నేష‌న‌ల్ ఛాన‌ల్ తో ప్రియాంక చోప్రా మాట్లాడారు. త‌న మ‌న‌సు లోని మాట‌ల‌ను బ‌య‌ట పెట్టారు. త‌న‌కంటే చిన్న వాడైన సింగ‌ర్ ను పెళ్లాడింది ఈ ముద్దుగుమ్మ‌. మొద‌టిసారిగా త‌ల్లి అయిన‌ప్పుడు ఆందోళ‌న‌కు గుర‌య్యాను. ప్ర‌పంచంలోని ప్ర‌తి త‌ల్లి ప‌డేదే. నేను కూడా సేమ్ క‌దూ అని పేర్కొంది.

నేను నా పేరెంట్స్ నుంచి చాలా నేర్చుకున్నా. ఎక్క‌డా త‌గ్గ కూడ‌దు. ఎవ‌రినీ ఆశించ కూడ‌దు. మ‌న కాళ్ల మీద మ‌నం నిల‌బ‌డాలి. అంటే అర్థం న‌న్ను నేను ప్రూవ్ చేసుకోవాల‌ని అనుకున్నారు. న‌టిగా, ఆంట్ర‌ప్రెన్యూర్ గా ఎదిగాను. ఇప్ప‌టికీ ఎన‌లేని ఛాన్స్ లు వ‌స్తున్నాయి. కానీ క‌థ‌కు ప్ర‌యారిటీ ఉన్న వాటినే ఎంచుకుంటున్నా. ఏది ఏమైనా త‌ల్లి తనాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నానంటోంది ప్రియాంక‌.

Comments (0)
Add Comment