Hero Nithin Reddy :నితిన్ రెడ్డి మోసం నిర్మాత ఆగ్ర‌హం..?

మ‌ల్లిడి స‌త్య‌నారాయ‌ణ రెడ్డి షాకింగ్ కామెంట్స్

Nithin Reddy : హీరో నితిన్ రెడ్డిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు నిర్మాత మ‌ల్లిడి స‌త్య నారాయ‌ణ రెడ్డి. ఒప్పందం చేసుకుని ఉల్లంఘించారంటూ వాపోయారు. ముంద‌స్తుగా రూ. 75 ల‌క్ష‌లు తీసుకున్నాడంటూ పేర్కొన్నారు. ఈ నిర్మాత ఎవ‌రో కాదు ఢీ, బ‌న్నీ, భ‌గీర‌థ సినిమాలు నిర్మించారు. ఆయ‌న నితిన్(Nithin Reddy) పై చేసిన ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. టాలీవుడ్ లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. త‌న‌తో, త‌న కొడుకు వశిష్ట‌తో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడ‌ని, అడ్వాన్స్ తీసుకున్నా ఇప్పుడు ప‌ల‌క‌డం లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు నిర్మాత .

Nithin Reddy – Producer Serious

ముందస్తు ఒప్పందం ప్ర‌కారం అడ్వాన్స్ తీసుకున్న హీరో ఇప్పుడు ప‌ల‌క‌డం లేదంటూ మండిప‌డ్డాడు. గ‌త్యంత‌రం లేక త‌ను ఒప్పందాన్ని ఉల్లంఘించ‌డంతో త‌న కొడుకు వ‌శిష్ట చివ‌ర‌కు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ తో బింబిసార తీశాడ‌ని చెప్పాడు. ఆ మూవీతో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చాడ‌ని తెలిపారు మ‌ల్లిడి స‌త్య నారాయ‌ణ రెడ్డి. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం త‌ను మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభ‌ర తీస్తున్నాడు. దీనిపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే సినిమాకు సంబంధించి కీల‌క అప్ డేట్ కూడా వ‌చ్చింది.

ఇదే స‌మ‌యంలో ఆయ‌న తాజాగా మెగా స్టార్ మూవీ పై కూడా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. విశ్వంభ‌ర మూవీలో ఏఐని ఉప‌యోగించ‌డం జ‌రిగింద‌న్నారు. దీనిపై మెగా అభిమానులు అంత‌గా జీర్ణించు కోవ‌డం లేదు.

ఒక ఇంటర్వ్యూలో, నిర్మాత కూడా తన నిబద్ధతను గౌరవించనందుకు అల్లు శిరీష్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. మొత్తం మీద, అతని ఈ వివాదాస్పద ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Also Read : Hero Yash-KGF 3 :య‌శ్ కేజీఎఫ్ 3 సీక్వెల్ లో కోలీవుడ్ హీరో

CommentsNithinShockingViral
Comments (0)
Add Comment