Naga Vamsi : సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మాత నాగవంశీ(Naga Vamsi) గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేయడం అది వైరల్ గా మారడం షరా మూమూలై పోయింది. ఎవరినీ లెక్క చేయని తత్వం అనేది తన మాటల్లో కనిపిస్తుంది. చాలా మంది దానిని పొగరు అంటారు. ఇంకొందరు ఆత్మ విశ్వాసం అని పేరు పెడతారు. తను నిర్మించిన చిత్రం సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ . ఇప్పటికే పోస్టర్స్, టీజర్, సాంగ్స్ , ట్రైలర్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. గతంలో విచ్చిన మ్యాడ్ రికార్డ్ బ్రేక్ చేసింది. భారీ వసూళ్లను సాధించింది. తాజాగా సీక్వెల్ కూడా పూర్తిగా కామెడీ, ఎంటర్ టైనర్ జానర్ లో తెరకెక్కించాడు దర్శకుడు కళ్యాణ్ రామ్.
Naga Vamsi Shocking Comments
ఈ సందర్బంగా జరిగిన చిట్ చాట్ లో నాగవంశీ మాట్లాడాడు. విచిత్రమైన కామెంట్స్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్ గురించి. తను ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సందర్బంగా తలైవా రజనీకాంత్ తో జైలర్ తీసిన డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో తారక్ తో కలిసి సినిమా తీయనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. దీనిపై స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు నాగవంశీ.
ఎన్టీఆర్ తో ఉంటుందా..అన్న మాటకు ఆయన హీరోనా ..తమ సినిమాలో అయితే కాదని ప్రకటించాడు. అంతే కాదు తప్పకుండా నెల్సన్ దిలీప్ కుమార్ తో చిత్రం ఉంటుందన్నాడు. కానీ ఇంకా హీరోను ఫైనల్ చేయలేదని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా తాజాగా నాగవంశీ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. ఎన్టీఆర్ హీరోనా అనడం వెనుక ఏమై ఉంటుందని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా నాగవంశీనా మజాకా అంటున్నారు తెలిసిన వారంతా.
Also Read : Hero Pradeep Ranganatha-Dragon :డ్రాగన్ ఓటీటీలోనూ సెన్సేషన్
Producer Naga Vamsi Shocking :నెల్సన్ తో ఓకే కానీ ఎన్టీఆర్ తో కాదు
నిర్మాత నాగవంశీ షాకింగ్ కామెంట్స్