Pushpa-2 Movie Song : పుష్ప-2 సాంగ్ లో బ‌న్నీ బిజీ

వేయి మంది డ్యాన్స‌ర్ల‌తో చిత్రీక‌ర‌ణ

Pushpa-2 Movie Song : డైన‌మిక్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పుష్ప దేశాన్ని ఒక ఉర్రూత లూగించింది. ఇందులోని పాట‌లు, అల్లు అర్జున్ న‌ట‌న‌, డైలాగులు దుమ్ము రేపాయి. ప్ర‌తి ఒక్క‌రినీ క‌ద‌లించాయి.

Pushpa-2 Movie Song Updates

విడుద‌లైన రోజు నుంచి ఇండియాతో పాటు ఓవ‌ర్సీస్ లో క‌లెక్ష‌న్ల వ‌ర‌ద పారించేలా చేసింది పుష్ప ది రైజ్. దీంతో ఊహించ‌ని రీతిలో బిగ్ స‌క్సెస్ కావ‌డంతో మైత్రీ మూవీ మేక‌ర్స్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పుష్ప కు సీక్వెల్ గా పుష్ప 2(Pushpa-2) తీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

దీంతో ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. దర్శ‌కుడు సుకుమార్ ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు. మూవీలోని బ‌న్నీ పోస్ట‌ర్ ను ముందుగా రిలీజ్ చేశారు. దీనికి భారీ ఎత్తున ఆద‌ర‌ణ ల‌భించింది. పుష్ప ఫ‌స్ట్ మూవీ కంటే ఈ సీక్వెల్ ఇంకా అద్భుతంగా రాబోతోంద‌ని ఇప్ప‌టికే నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉండ‌గా తాజాగా శ‌ర వేగంగా షూటింగ్ కొన‌సాగుతోంది. ఇందులో భాంగా ఏకంగా 1,000 మంది డ్యాన్స‌ర్ల‌తో పుష్ప రాజ్ పై పాట‌ను చిత్రీక‌రించారు. ప్ర‌ధానంగా మూవీ టీమ్ ను సుకుమార్ ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఎలాగైనా స‌రే బ‌న్నీని మ‌రో కోణంలో చూపించాల‌ని తాప‌త్ర‌యం ప‌డుతున్నాడు. మొత్తంగా త‌గ్గేదేలే అన్న డైలాగ్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

Also Read : Varun Tej: లావణ్యకు షాక్ ఇచ్చిన వరుణ్ తేజ్

Comments (0)
Add Comment