Pushpa 2 Popular : పుష్ప‌2 వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్ రూ. 1871 కోట్లు

అధికారికంగా ప్ర‌క‌టించిన మైత్రీ మూవీ మేక‌ర్స్

Pushpa 2 : సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా, శ్రీ‌లీల క‌లిసి న‌టించిన పుష్ప‌2 రికార్డ్ సృష్టించింది. అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ నిర్మాత‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అధికారికంగా తమ చిత్రం పుష్ప‌2(Pushpa 2) వ‌ర‌ల్డ్ వైడ్ గా ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 1871 కోట్లు వ‌సూలు చేసింద‌ని వెల్ల‌డించారు.

Pushpa 2 World Wide Collections

దీంతో గ‌తంలో ఎస్ఎస్ రాజ‌మౌళి తీసిన బాహుబ‌లి రికార్డును పుష్ప‌2 అధిగ‌మించింది. ఇండియ‌న్ సినీ ప్ర‌పంచంలోనే అద్భుతం అని చెప్ప‌క త‌ప్ప‌దు. పాన్ ఇండియాగా దీనిని తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కులు. ఇదిలా ఉండ‌గా అన్ని కాలాల‌లో అత్య‌ధిక వ‌సూళ్లు చేసిన మొద‌టి రెండు భార‌తీయ చిత్రాల‌లో ఒక‌టిగా త‌న స్థానాన్ని సంపాదించుకుంది.

సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ చిత్రం చేసిన వ‌సూళ్ల గురించి తెలియ చేసింది. దీంతో పుష్ప‌2 మరో సారి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆకట్టుకునే స‌న్నివేశాలు, గుండెల్ని మీటే డైలాగులు, వెర‌సి బ‌న్నీ న‌ట‌న‌, ర‌ష్మిక , శ్రీ‌లీల డ్యాన్సులు, రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన మ్యూజిక్, పాట‌లు పుష్ప‌2 చిత్రం భారీ ఎత్తున వ‌సూళ్లు చేసేందుకు దోహ‌ద ప‌డ్డాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

రికార్డ్ రాపా రాపా అంటూ మైత్రీ మూవీ మేక‌ర్స్ త‌న ఎక్స్ అధికారిక హ్యాండిల్ లో పేర్కొన‌డం విశేషం. కాగా పుష్ప‌2 కి ముందు బాలీవుడ్ న‌టుడు అమీర్ ఖాన్ న‌టించిన దంగ‌ల్ అత్య‌ధిక వ‌సూళ్లు చేసిన భార‌తీయ చిత్రంగా రికార్డ్ ను క‌లిగి ఉంది. చైనాలో కూడా విడుద‌లై భారీ ఆద‌ర‌ణ‌ను పొందింది. మొత్తం వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 2,122 కోట్లు వ‌సూలు చేసింది.

Also Read : Akhil-Zainab Love Marriage :అఖిల్ అక్కినేని జైనాబ్ ముహూర్తం ఫిక్స్

CinemaPushpa 2TrendingUpdates
Comments (0)
Add Comment