R M Veerappan: రజనీకాంత్ ‘బాషా’ సినిమా నిర్మాత మృతి !

రజనీకాంత్ ‘బాషా’ సినిమా నిర్మాత మృతి !

R M Veerappan: కోలీవుడ్ లో విషాదం నెలకొంది. రజనీకాంత్ కెరీర్ ను మలుపుతిప్పిన ‘బాషా’ చిత్ర నిర్మాత, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ సన్నిహితుడు ఆర్‌ఎం వీరప్పన్‌ (97) మంగళవారం కన్నుమూశారు. ఎంజీ రామచంద్రన్‌, రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ లాంటి అగ్ర కథానాయకులతోపాటు ఇతరుల చిత్రాలెన్నో నిర్మించారు.

R M Veerappan No More

అందులో ‘కావాల్‌కారన్‌’, ‘ఇదాయకణి’, ‘మూండ్రుముగన్‌’, ‘తంగమగన్‌’, ‘పనక్కరన్‌’, ‘కాద్‌ పారిసు’, ‘బాషా’లాంటి సినిమాలు ఘనవిజయాలు సాధించాయి. వృద్ధాప్యంలోని అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆదివారం చేరిన వీరప్పన్… మంగళవారం తుది శ్వాస విడిచారు. బుధవారం సాయంత్రం నుంగంబాకంలో కుటుంబ సభ్యులు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. వీరప్పన్ మృతి పట్ల పలువురు కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేసారు.

Also Read : Salaar 2 : సలార్ 2 రిలీజ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్

R.M. VeerappanSuper Star Rajanikanth
Comments (0)
Add Comment