Rachna Banerjee: రాజకీయాలు సినిమాలకు విడదీయరాని బంధం ఉంది. ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు చాలా మంది రాజకీయాలపై ఆశక్తి చూపుతున్నారు. ఇటీవల జరిగిన 2024 లోక్ సభ ఎన్నికల్లో హేమ మాలిని, నవనీత్ కౌర్, కంగనా రనౌత్, కుష్బూ సుందర్ వంటి పలువురు స్టార్ హీరోయిన్లు పోటీ చేసారు. ఇప్పుడు వారి కోవలో ఒకప్పటి టాలీవుడ్ బ్యూటీ రచనా బెనర్జీ కూడా పార్లమెంట్ లో అడుగుపెట్టబోతున్నారు. ‘నేను ప్రేమిస్తున్నాను’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి… ‘కన్యాదానం’, ‘మావిడాకులు’, ‘అభిషేకం’, ‘బావగారూ.. బాగున్నారా?’, ‘రాయుడు’, ‘సుల్తాన్’, ‘పిల్ల నచ్చింది’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రచనా బెనర్జీ(Rachna Banerjee) ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ లోక్ సభ స్థానం నుండి ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే విజయం అందుకున్నారు. ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా హుగ్లీ లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన ఆమె… సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి లాకెట్ ఛటర్జీపై 76,853 ఓట్ల మెజార్టీ సాధించి… తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు.
Rachna Banerjee..
కోల్ కతాకు చెందిన రచన 1991లో మిస్ కోల్‌కతా కిరీటాన్ని ధరించారు. 1992 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. అప్పట్లో ఆమెను ‘మిస్ బ్యూటిఫుల్ స్మైల్’ అని పిలిచేవారు. అందాల కిరీటం అందుకున్న ఆమె చిత్ర పరిశ్రమనూ ఆకర్షించింది. అలా 1993లో ‘దాన్ ప్రతిదాన్’ అనే బెంగాలీ సినిమాతో తెరంగేట్రం చేశారు. తమిళ్, కన్నడ, హిందీ, ఒడియా సినిమాల్లోనూ విభిన్న పాత్రలు పోషించారు. 1997లో ‘నేను ప్రేమిస్తున్నాను’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. రెండో సినిమా ‘కన్యాదానం’తో మంచి గుర్తింపు పొందారు. 1998లో ఆ మూవీతో పాటు మరో నాలుగు విడుదలయ్యాయంటేనే ఆమె ఎలాంటి ప్రతిభ చూపిందో అర్థం చేసుకోవచ్చు. అవే ‘మావిడాకులు’, ‘అభిషేకం’, ‘బావగారూ.. బాగున్నారా?’, ‘రాయుడు’, ‘సుల్తాన్’, ‘పిల్ల నచ్చింది’.. ఇలా వరుస సినిమాలతో ఆడియన్స్‌కు మంచి వినోదం పంచారు.
తెలుగులో చివరిగా నటించిన చిత్రం ‘లాహిరి లాహిరి లాహిరిలో’. అయితే రచన(Rachna Banerjee) టాలీవుడ్‌కు దూరమైనప్పటికీ ఇతర భాషల్లో కొన్ని సినిమాలలో నటించి మెప్పించారు. బెంగాలీ టీవీ రియాల్టీ షో ‘దీదీ నం.1’ వ్యాఖ్యాతగా సత్తా చాటారు. అటు నటిగా, ఇటు యాంకర్‌గా పాపులారిటీని సొంతం చేసుకున్న రచన ఈ ఏడాదే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలి ప్రయత్నంలోనే ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా హుగ్లీ లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన ఆమె.. సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి లాకెట్ ఛటర్జీపై 76,853 ఓట్ల మెజార్టీ సాధించారు.
Also Read : Matka Movie : హైదరాబాద్ మ్యాస్సివ్ సెట్ లో జోరుగా సాగుతున్న ‘మట్కా’ షూటింగ్