ఢిల్లీ – ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలనంగా మారారు. శుక్రవారం ఉన్నట్టుండి ఢిల్లీ యూనివర్శిటీని సందర్శించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పొలిటికల్ లీడర్ ఎలా యూనివర్శిటీలోకి వస్తాడంటూ ప్రశ్నించింది భారతీయ జనతా పార్టీ.షెడ్యూల్డ్ కుల (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) విద్యార్థులతో సంభాషించారు. దీనిపై తీవ్రంగా మండిపడింది. కేవలం ప్రచారం కోసమే ఇలా రాహుల్ గాంధీ చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు.
తన పర్యటన యూనివర్శిటీలో కలకలం రేపడంతో పాటు విద్యార్థుల మధ్య విభేదాలను మరోసారి రెచ్చగొట్టేలా చేసేందుకే వెళ్లాడంటూ ఆరోపించింది. విశ్వ విద్యాలయ పరిపాలన ప్రోటోకాల్ ఉల్లంఘనలపై ఆందోళన వ్యక్తం చేసింది . బీజేపీ ఆయన విద్యా స్థలాలను రాజకీయం చేస్తున్నారని ఆరోపించింది. అణగారిన విద్యార్థి వర్గాలతో చట్టబద్ధమైన సంబంధంగా ఈ సందర్శనను కాంగ్రెస్ పార్టీ సమర్థించింది.
డీయూ ప్రొక్టర్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రెండోసారి ముందస్తు నోటీసు లేకుండా విశ్వ విద్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించారని ఆరోపించింది. తద్వారా సంస్థాగత నిబంధనలను ఉల్లంఘించారని లేఖలో పేర్కొంది. ఆయనకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ మండిపడింది. చట్ట పరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.