Raj Tarun : నా కోసం ఇంత చేసిన ఆయన కోసం బిగ్ బాస్ కి అయినా వెళ్తాను

చార్జ్‌షీట్‌లో రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చారు...

Raj Tarun : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పెద్ద వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. లావణ్య అనే యువతిని మోసం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతీ సంచలన ఆరోపణలు చేసింది. తనను ప్రేమ పేరుతో వాడుకొని వదిలేశాడని,తనతో సహజీవనం చేసి ఇప్పుడు మరో నటితో రిలేషన్ పెట్టుకున్నాడని లావణ్య ఆరోపిస్తుంది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా‌తో రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నాడని లావణ్య ఆరోపిస్తుంది. ఇప్పటికే రాజ్ తరుణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. రాజ్‌తరుణ్‌(Raj Tarun) మోసం చేశారంటూ నటి లావణ్య కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు..ఇటీవలే కేసుకు సంబంధించి చార్జిషీట్ దాఖలు చేశారు.

Raj Tarun Comment

చార్జ్‌షీట్‌లో రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చారు. రాజ్‌తరుణ్‌- లావణ్య పదేళ్లు సహజీవనం చేసినట్లు చార్జిషీట్‌లో స్పష్టం చేశారు. రాజ్‌తరుణ్‌- లావణ్య పదేళ్లు ఒకే ఇంట్లో ఉన్నారని.. లావణ్య చెప్పేవి వాస్తవాలేనని పోలీసులు తెలిపారు. ఇక.. లావణ్య కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్ తీసుకున్నాడు రాజ్‌తరుణ్(Raj Tarun). ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ కు సపోర్ట్ గా ఆర్జే శేఖర్ బాషా ముందుకు వచ్చాడు. లావణ్య పై అతడు ఆరోపణలు చేశాడు. తాజాగా శేఖర్ బాషా గురిని రాజ్ తరుణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. రాజ్ తరుణ్ తాజాగా భలే ఉన్నాడే అనే సినిమా చేశాడు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు రాజ్ తరుణ్. ఈ సందర్భముగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్‌కు శేఖర్ భాషకు సంబందించిన ప్రశ్న ఎదురైంది. శేఖర్ బాషా నిజం కోసం నిలబడ్డాడు.. సరైన సమయంలో ఆధారాలతో వచ్చి నాకు చాలా సాయం చేశాడు అని రాజ్ తరుణ్ అన్నాడు. తనకోసం వీలైతే బిగ్ బాస్ కి వెళ్లి సపోర్ట్ చేస్తానని అన్నాడు రాజ్ తరుణ్. అలాగే శేఖర్ బాషాతో తనకు పెద్దగా పరిచయం లేదని , అంతకు ముందు కొన్ని సినిమా ప్రమోషన్స్ లో మాత్రమే కలిసాను అంతే తప్ప తనకు అతనితో స్నేహం లేదు అని అన్నాడు. అయితే తన కోసం శేఖర్ బాషా చాలా చేశాడని. ఇప్పుడు శేఖర్ బాషా తనకి మంచి మిత్రుడిగా మారాడని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు.

Also Read : Devara Update : ఎన్టీఆర్ దేవర సినిమాకు షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డు

BreakingRaj TarunShekar BashaUpdatesViral
Comments (0)
Add Comment