డిసెంబ‌ర్ 5న ప్ర‌భాస్ రాజా సాబ్ రిలీజ్

మూవీ మేక‌ర్స్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో వెరీ స్పెష‌ల్ డార్లింగ్ ప్ర‌భాస్. త‌ను తాజాగా న‌టించిన చిత్రం రాజా సాబ్. దీనిని మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందించ‌గా పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజ‌ర్ కు సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే సినిమా విడుద‌ల కావాల్సి ఉండ‌గా ఇంకా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కొన‌సాగుతోంది. దీనిపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు మారుతి. త‌న‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ప్ర‌భాస్ అభిమానులు.ఈ చిత్రం కోసం ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు.

చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌, విడుద‌లకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు మారుతి. ఈ మేర‌కు తీపి క‌బురు చెప్పారు. వ‌చ్చే డిసెంబ‌ర్ 5వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామ‌న్నారు. దీంతో అనుమానాల‌కు, ఉత్కంఠ‌కు తెర దించే ప్ర‌య‌త్నం చేయ‌డం విశేషం. సినిమా అన్నాక ఇబ్బంది ఉంటుంద‌ని, తాను ఒక్క‌డి వ‌ల్ల‌నే చిత్రం పూర్తి కాద‌న్నారు. సాంకేతిక నిపుణులు ఏక కాలంలో స‌హ‌కారం ఉంటేనే వ‌ర్క‌వుట్ అవుతుంద‌న్నారు.

ఇక సినిమాకు సంబంధించి అప్ డేట్ వ‌చ్చింది. 30 నిమిషాల పాటు థ్రిల్లింగ్ యాక్ష‌న్స్ తో ఇర‌గ దీశాడు డార్లింగ్ ప్ర‌భాస్. త‌న కెరీర్ ప‌రంగా ఇది రెండో మూవీ రొమాంటిక్ హీరోగా చేయ‌డం. గ‌తంలో త‌ను మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ మూవీలో న‌టించాడు. ఈ మూవీ విభిన్నమైన హర్రర్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని హామీ ఇచ్చారు ద‌ర్శ‌కుడు మారుతి, నిర్మాత టీజీ విశ్వ ప్ర‌సాద్.

అమెరికాకు చెందిన వీఎఫ్ఎక్స్ కంపెనీ గ్రాఫిక్స్ విష‌యంపై ఫోక‌స్ పెడుతున్న‌ట్లు స‌మాచారం. తాజాగా ప్ర‌భాస్ న్యూ లుక్ సూప‌ర్ గా ఉందంటూ ఫ్యాన్స్ తెగ సంతోష ప‌డుతున్నారు.

Comments (0)
Add Comment