రాజా సాబ్ ప్ర‌భాస్ లేటెస్ట్ లుక్ అదుర్స్

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న పోస్ట‌ర్స్

డార్లింగ్ ప్ర‌భాస్ ఏది చేసినా సంచ‌ల‌న‌మే. భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో అత్య‌ధిక పారితోష‌కం తీసుకుంటున్న కొద్ది మంది న‌టుల‌లో త‌ను ఒక‌డు. త‌న‌తో సినిమా తీయాల‌న్నా ఓ రేంజ్ క‌లిగి ఉండాలి నిర్మాత‌లు. త‌న సినిమా పాస్, ఫెయిల్ తో సంబంధం అనేది ఉండ‌దు. పెట్టిన పెట్టుబ‌డికి రెండింత‌లు రావ‌డం ప‌క్కా. దీంతో త‌న‌తో మూవీస్ చేసేందుకు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. కానీ త‌నేవీ ప‌ట్టించు కోవ‌డం లేదు. కేవ‌లం సినిమాల‌పైనే ఫోక‌స్ పెట్ట‌డం చేస్తున్నాడు.

తాజాగా త‌ను బిజీగా మారాడు. క‌ల్కీ మూవీ హిట్ కావ‌డంతో సీక్వెల్ పై దృష్టి సారించాడు. ఆపై ఫౌజ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇదే స‌మ‌యంలో ఆ సినిమా అయిపోయిన వెంట‌నే డైన‌మిక్ డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డితో క‌మిట్ అయ్యాడు. త‌న‌తో క‌లిసి స్పిరిట్ పాన్ ఇండియా మూవీకి సైన్ చేశాడు. దీంతో ఫుల్ క్లారిటీ క‌లిగి ఉన్నాడు. ఇదే క్ర‌మంలో ద‌ర్శ‌కుడు మారుతి తీస్తున్న రాజా సాబ్ చిత్రానికి సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది.

సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ ప్ర‌భాస్ పోస్ట‌ర్ లీక్ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల‌ను షేక్ చేస్తున్నాయి. పూర్తిగా రొమాంటిక్ మూడ్ లో ఉన్నాడు ప్ర‌భాస్. మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ మూవీ త‌ర్వాత త‌ను చేస్తున్న పాత్ర ఇది కావ‌డంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రాజా సాబ్ పై న‌మ్మ‌కం పెట్టుకున్నారు. దీనికి ఎస్ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దాదాపు 90 శాతం దాకా షూటింగ్ పూర్త‌యింద‌ని, ఇంకా ఒక పాట‌, కీల‌క స‌న్నివేశాలు మాత్ర‌మే మిగిలి ఉన్నాయ‌ని ప్ర‌క‌టించాడు మారుతి. దీనిని పీపుల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది.

Comments (0)
Add Comment