J. Livingston: సీనియర్ నటుడి భార్యకు ప్రాణ పోసిన రజనీకాంత్ !

సీనియర్ నటుడి భార్యకు ప్రాణ పోసిన రజనీకాంత్ !

J. Livingston: కోలీవుడ్‌ పరిచయం అక్కర్లేని పేరు స్క్రీన్ రైటర్, సీనియర్ నటుడు జె లివింగ్‌స్టన్‌(J. Livingston). దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన గతంలో హీరోగా కూడా పలు సినిమాల్లో కనిపించాడు. రజనీకాంత్, విజయకాంత్, అజిత్‌ వంటి సూపర్ స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆయనకు ప్రస్తుతం చిన్న పాత్రలకే పరిమితం అయ్యారు. కొన్నేళ్లుగా భారీ సినిమాల్లో ఛాన్స్‌ లు దక్కక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయనకు ఇటీవల ‘లాల్ సలామ్’ తో రజనీకాంత్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అందుకు రజనీకాంత్ సహాయం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో రజనీకాంత్ గురించి లివింగ్ స్టన్ పలు ఆశక్తికరమైన విషయాలను వెల్లడించారు.

J. Livingston Comment

ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లివింగ్‌స్టన్‌ మాట్లాడుతూ… ‘లాల్ సలామ్‌లో రజనీకాంత్ స్నేహితుడిగా నేను నటించాను. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో నా సతీమణి జెస్సీకి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రిలో అయితే చేర్పించాము కానీ అందుకు సరిపోయే డబ్బు నా వద్ద లేదు. అప్పుడు ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిలో నేను ఉన్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ల ద్వారా ఈ వార్త ఎలాగో రజనీ సర్ చెవులకు చేరింది. ఆ సమయంలో వెంటనే నాకు రజనీ సార్‌ ఫోన్ చేసి పరామర్శించారు. ఆపై ఆపరేషన్‌కు ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు. నేను నిన్ను అన్నయ్యలా చూస్తున్నాను ఎంత అవసరమో చెప్పు అని రజనీ గారు పదేపదే అడిగారు.

నా సతీమణి వైద్య ఖర్చుల కోసం అవసరమైన రూ. 15 లక్షల రూపాయలు రజనీ సార్‌ పంపించారు. నేను ఇప్పటికే అప్పుల్లో ఉన్నానని, మళ్లీ తిరిగి ఇవ్వలేనని ఆయనకు తెలుసు.. అయినా సాయం చేశారు. సూపర్‌స్టార్‌ సాయం చేయకుంటే నేను నా భార్యను రక్షించేవాడిని కాదు. రజనీ సార్‌ది గోల్డెన్ హార్ట్, నాకే కాదు నాలాంటి ఎంతో మంది ఆర్టిస్టులకు సరైన సమయంలో సహాయం చేసి వారి కుటుంబాల్లో సంతోషం నింపిన గుండె ఆయనది.’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం లివింగ్‌స్టన్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Also Read : Jaffer Sadiq: అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్‌ లొ కోలీవుడ్ నిర్మాత !

J. LivingstonSuper Star Rajanikanth
Comments (0)
Add Comment