Rajinikanth Visit : జ‌యన‌గ‌ర్ బ‌స్ డిపోలో ర‌జ‌నీకాంత్

బెంగ‌ళూరును సంద‌ర్శించిన సూప‌ర్ స్టార్

Rajinikanth Visit : త‌మిళ‌నాడు సూప‌ర్ స్టార్, త‌లైవా ర‌జ‌నీకాంత్ విస్తు పోయేలా చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న బెంగ‌ళూరుకు వెళ్లారు. ఎవ‌రికీ స‌మాచారం ఇవ్వ‌కుండానే జ‌యన‌గ‌ర్ బ‌స్సు డిపోకు వెళ్లారు. అక్క‌డున్న కండ‌క్ట‌ర్లు, డ్రైవ‌ర్లు ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు.

ఎందుకంటే ర‌జ‌నీకాంత్ జ‌యన‌గ‌ర్ ఆర్టీసీ డిపోలో కండ‌క్ట‌ర్ గా ప‌ని చేశారు. ఆయ‌న స్వ‌స్థ‌లం క‌ర్ణాట‌క‌నే. ఆయ‌న పూర్తి పేరు గైక్వాడ్. కానీ ఓ వైపు కండ‌క్ట‌ర్ గా ప‌ని చేస్తున్నా త‌న మ‌న‌సంతా సినిమాల‌పై ఉండేది. దీంతో ఒక రోజు కండ‌క్ట‌ర్ ఉద్యోగానికి గుడ్ బై చెపేశాడు. ఆ వెంట‌నే త‌మిళ‌నాడుకు చెక్కేశాడు.

Rajinikanth Visit Jayanagar Bus Depot

ఈ త‌రుణంలో అత‌డిలోని న‌టుడిని , క‌సిని , ప‌ట్టుద‌ల‌ను ముందుగా గుర్తించింది మాత్రం దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు బాల‌చంద‌ర్. ఆయ‌న‌కు అపార‌మైన న‌మ్మ‌కం ఉంది. గైక్వాడ్ ను ర‌జ‌నీకాంత్(Rajinikanth) గా మార్చేశాడు. ఆనాటి నుంచి నేటి దాకా సూప‌ర్ స్టార్ గా వెలుగొందుతున్నాడు.

తాజాగా యువ ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో 72 ఏళ్ల ర‌జ‌నీకాంత్ న‌టించిన జైల‌ర్ విడుద‌లై దుమ్ము రేపుతోంది. భారీ క‌లెక్ష‌న్లు రాబ‌డుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 612-47 కోట్లు కొల్ల‌గొట్టింది. త‌న‌కు జీవితాన్ని ఇచ్చిన ఉద్యోగాన్ని, సంస్థ‌ను మ‌రిచి పోలేదు ర‌జ‌నీకాంత్. జ‌య‌న‌గ‌ర్ డిపోకు వెళ్లిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Also Read : Murthy Pratindhi2 Movie : ప్ర‌తినిధి 2 మూవీ అప్ డేట్

Comments (0)
Add Comment