Bombay Re-Release Sensational :బొంబాయి మూవీని రిలీజ్ చేస్తే త‌ట్టుకోలేరు

సినిమాటోగ్రాఫ‌ర్ రాజీవ్ మీన‌న్ కామెంట్స్

Bombay : భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం బొంబాయి. దీనిని మ‌ణిర‌త్నం తెర‌కెక్కించాడు. ఇందులో అర‌వింద్ స్వామి, మ‌నీషా కొయిరాల కీల‌క పాత్ర‌లు పోషించారు. ముస్లిం మ‌హిళ పాత్ర‌లో ఒదిగి పోయింది. ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమను అద్భుతంగా ఆవిష్క‌రించాడు ద‌ర్శ‌కుడు. ముంబై మాఫియా, దాడులు, నిరంత‌ర కాల్పుల మ‌ధ్య క‌ళ్లకు క‌ట్టేలా చిత్రీక‌రించిన తీరు ప్రేక్ష‌కుల గుండెల‌ను మీటింది. వీనుల విందైన సంగీతం, అంత‌కు మించిన వేటూరి సుంద‌ర రామ్మూర్తి సాహిత్యం , వెర‌సి న‌టీ నటుల న‌ట‌న పీక్ కు తీసుకు వెళ్లేలా చేసింది.

Bombay Movie Re-Release Sensational Updates

ప్ర‌త్యేకించి సినిమాకు హైలెట్ సినిమాటోగ్ర‌ఫీ. దీని గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇక పాట‌లు ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ . ఈ సంద‌ర్బంగా రాజీవ్ మేనన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆనాడు బొంబాయిని(Bombay) తీయ‌గ‌లిగాం. కానీ ఇప్పుడు ఇలాంటి సినిమాను తీయ‌డం చాలా క‌ష్ట‌మ‌న్నాడు. ఎందుకంటే ఇప్పుడు మ‌తం పూర్తిగా డామినేట్ చేస్తోంద‌న్నాడు. ఈ ప‌రిస్థితుల్లో గ‌నుక సినిమా విడుద‌లైతే థియేట‌ర్లు త‌గుల బ‌డి పోవ‌డం ఖాయ‌మ‌న్నాడు. ఆయ‌న చేసిన కామెంట్స్ ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఇదే రాజీవ్ మేన‌న్ బొంబాయితో పాటు మెరుపు క‌ల‌లు, విడుద‌ల , క‌డ‌లి , లాంటి సూప‌ర్ సినిమాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్ గా ప‌ని చేశాడు. ఆనాటి ప‌రిస్థితులు వేరు. ఏ సినిమా వ‌చ్చినా దానిని సినిమాలాగే చూసే వార‌ని, కానీ ఇప్పుడు అలా లేద‌న్నాడు. మ‌నుషుల మ‌ధ్య విద్వేషాలు, మ‌తాలు, కులాల రొచ్చుగుంట‌లో ప‌డి పోయారంటూ వాపోయాడు . మ‌తం అనేది పెద్ద స‌మ‌స్య‌గా మారింద‌న్నాడు. ఇది రాబోయే కాలంలో మ‌రింత ప్ర‌మాదం అని పేర్కొన్నాడు. రోజు రోజుకు ప్ర‌జ‌ల్లో స‌హ‌నం అనేది లేకుండా పోతోంద‌ని వాపోయాడు.

Also Read : Popular Actor Tom Chacko :డ్ర‌గ్స్ కేసులో నటుడు టామ్ చాకో అరెస్ట్

BombayCinemaRe-ReleaseUpdatesViral
Comments (0)
Add Comment