Hero Dhanush-Periyasamy :పెరియ‌సామితో ధ‌నుష్ మూవీకి సిద్దం

ధ‌నుష్ 55 పేరుతో తాత్కాలిక టైటిల్ ఫిక్స్

Dhanush : త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో వెరీ వెరీ స్పెష‌ల్ న‌టుడు, ద‌ర్శ‌కుడు ధ‌నుష్. ప్ర‌స్తుతం హిందీ మూవీలో న‌టిస్తున్నాడు. దాదాపు ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావ‌స్తోంది. ఇదే స‌మ‌యంలో త‌ను కీ రోల్ పోషించిన మూకీ ఇడ్లీ క‌డైపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. క‌థ బాగుంటే చాలు ఎంత ఖ‌ర్చ‌యినా స‌రే పెట్టేందుకు కూడా వెనుకాడ‌డు. ఇదీ త‌న ప్ర‌త్యేక‌త‌.

Dhanush – Periyasamy Movie Updates viral

ప్ర‌జలు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు, స‌హ‌జ‌త్వానికి ద‌గ్గ‌ర ఉండేలా క‌థ‌లు ఉండాల‌ని భావిస్తాడు ధ‌నుష్(Dhanush). ఏదో ర‌కంగా కొత్త‌ద‌నం ఉండేలా జాగ్ర‌త్త ప‌డ‌తాడు. ఇలాంటి ఆలోచ‌న‌ల‌తో ముందుకు వ‌చ్చే వారిని వెన్నుత‌ట్టి ప్రోత్స‌హిస్తాడు. అందుకే త‌నంటే చాలా మందికి ఇష్టం. ఇక పెరియార్ తీసిన‌ అమ‌ర‌న్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. కాసుల వ‌ర్షం కురిపించింది. తాజాగా కీల‌క అప్ డేట్ ఇచ్చాడు ధ‌నుష్. ఈ మూవీ డైరెక్ట‌ర్ తో తాను సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

తాత్కాలికంగా సినిమాకు సంబంధించి ధ‌నుష్ 55 పేరుతో టైటిల్ ను ఖ‌రారు చేసిన‌ట్లు వెల్ల‌డించాడు. త‌ను గ‌తంలో హిందీలో న‌టించిన రాన్ జ‌నా బిగ్ హిట్ అయ్యింది. దీనికి సీక్వెల్ గా తేరే ఇష్క్ మే వ‌స్తోంది. ఇందులో ఇదే ద‌ర్శ‌కుడితో కీ రోల్ పోషిస్తున్నాడు ధ‌నుష్. ఈ మూవీ పూర్త‌యిన వెంట‌నే ధ‌నుష్ 55 లో న‌టించేందుకు రెడీ అవుతాడ‌ని, క‌థకు కూడా ఓకే చెప్పాడ‌ని కోలీవుడ్ లో టాక్. మొత్తంగా మ‌రో మూవీకి ప్లాన్ చేశాడు.

Also Read : Hero Prithwiraj Sukumaran : ఉత్త‌మ న‌టుడిగా పృథ్వీరాజ్ సుకుమార‌న్

CinemadhanushPeriyasamyUpdatesViral
Comments (0)
Add Comment