Hero Ram Charan-Peddi :చెర్రీ పెద్ది ఫ‌స్ట్ షాట్ గ్లింప్స్ కెవ్వు కేక

గ్లోబ‌ల్ స్టార్ బుచ్చిబాబు మూవీ

Ram Charan : వెంక‌ట్ స‌తీష్ కిలారు నిర్మిస్తున్న చిత్రం పెద్ది(Peddi). గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్(Ram Charan), బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్, క‌న్న‌ట సూప‌ర్ స్టార్ శివ రాజ్ కుమార్, మాజీ క్రికెట్ స్కిప్ప‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌డంతో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పోస్ట‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఉప్పెన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌కత్వంలో వ‌స్తున్న రెండో మూవీ ఇది. ఈ సినిమాకు ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించాడు.

Ram Charan-Peddi Movie Glimpse

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత వ‌చ్చిన గేమ్ ఛేంజ‌ర్ ఆశించిన మేర ఆడ‌లేదు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. భారీ అప‌జ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. నిర్మాత దిల్ రాజుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది ఈ మూవీ. సంక్రాంతికి వ‌స్తున్నాం చిత్రం గ‌ట్టెక్కించేలా చేసింది. ఈ మూవీ రూ. 300 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. అద్భుత‌మైన క‌థ‌కు ప్రాణం పోశాడు ద‌ర్శ‌కుడు.

తాజాగా మూవీ మేక‌ర్స్ శ్రీ‌రామ న‌వ‌మి పండుగ సంద‌ర్బంగా పెద్ది సినిమా నుంచి షాట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అంతేకాకుండా ముంద‌స్తుగానే సినిమా విడుద‌ల తేదీని కూడా ఖ‌రారు చేశారు. ఇందులో రామ్ చ‌ర‌ణ్ ను డిఫ‌రెంట్ గా చూపించాడు బుచ్చిబాబు స‌న‌. బీడీ తాగుతూ క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టే సీన్ సింప్లీ సూప‌ర్ గా ఉంది. మెగా ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వ‌చ్చేలా ఉంది. త‌న డైలాగ్ లతో పిచ్చెక్కించేలా చేశాడు చెర్రీ. ఇందులో విజ‌య‌న‌గ‌రం యాస ప్ర‌త్యేకంగా హైలెట్ గా నిలిచింది.

Also Read : Kausalya Tanaya Raghava Sensational :కౌస‌ల్య త‌న‌య రాఘ‌వ ట్రైల‌ర్ సూప‌ర్

CinemaGlobal Star Ram CharanPeddiTrendingUpdates
Comments (0)
Add Comment